
దాదాపు మూడు దశాబ్దాల తరువాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచి థగ్ లైఫ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన నాయకుడు సినిమాకు ఈ మూవీ సీక్వెల్ అన్న ప్రచారం కూడా జరిగింది. ముఖ్యంగా రెండు సినిమాల్లో కమల్ పేరు ఒకటే కావటంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి.
లేటెస్ట్ అప్డేట్తో కథ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన సాంగ్‌ను రిలీజ్ చేసింది థగ్ లైఫ్ టీమ్. ఈ పాటలో నాయకుడు సినిమాకు సంబంధించి క్యారెక్టర్సేవి కనిపించలేదు.
దీంతో థగ్ లైఫ్ సీక్వెల్ కాదు పూర్తిగా కొత్త కథే అన్న కంక్లూజన్‌కు వచ్చేశారు ఆడియన్స్. అలాగే కాస్టింగ్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది టీమ్. ఈ సినిమాలో త్రిష నటిస్తున్నట్టుగా ప్రకటించగానే ఆమె కమల్‌కు జోడీగా కనిపించబోతున్నారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.
కానీ ఆమె శింబుకు జోడీగా కనిపించబోతున్నారు. కమల్ భార్యగా సీనియర్ నటి అభిరామి నటించారు. ఇలా కథ విషయంలో అభిమానుల డౌట్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టిన యూనిట్, నెక్ట్స్ అప్డేట్స్తో మరింత క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.