
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ తండేల్. కార్తీకేయ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చైతూ సరసన మరోసారి న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా తండేల్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇటీవల వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. తండేల్ అంటే ఓనరా.. ? కాదు లీడర్ అంటూ వచ్చే డైలాగ్స్ తో ట్రైలర్ సినిమా పై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసింది. శ్రీకాకుళం మత్య్సకార బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తండేల్ జాతర గురించి స్పెషల్ అప్డేట్ షేర్ చేశారు మేకర్స్.
సినిమా విడుదలకు మరో వారం రోజులు టైమ్ మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వివరాలను షేర్ చేసింది మూవీ టీమ్. ఫిబ్రవరి 1న హైదరాబాద్ లోనే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలిపింది. పుష్ప రాజ్ ఫర్ తండేల్ రాజ్.. తండేల్ జాతర అంటూ పుష్పరాజ్ మాస్ పోస్టర్ తోపాటు తండేల్ మూవీ పోస్టర్ పంచుకుంది చిత్రయూనిట్. దీంతో ఇటు చైతూ ఫ్యాన్స్.. అటు బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తండేల్ కంటే ముందు చైతూ, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఇప్పుడు మరోసారి చైతూ, సాయి పల్లవి కలిసి నటిస్తుండడంతో తండేల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
𝐏𝐔𝐒𝐇𝐏𝐀 𝐑𝐀𝐉🔥for 𝐓𝐇𝐀𝐍𝐃𝐄𝐋 𝐑𝐀𝐉𝐔 ⚓🌊
ICON STAR @alluarjun garu will grace the #ThandelJaathara on February 1st in Hyderabad ❤️🔥
Stay excited for more details #Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.#ThandelonFeb7th #AlluArjunYuvasamrat… pic.twitter.com/W9DfVSHkEK
— Geetha Arts (@GeethaArts) January 31, 2025
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..