
తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్స్ లో మహిళలు సత్తా చాటారు. గతంలో ఇచ్చిన ప్రొవిజనల్ మార్కుల తర్వాత అభ్యంతరాలు ఉన్న వారి పేపర్ల రీకౌంటింగ్ పూర్తి చేసి జీఆర్ఎల్ విడుదల చేసింది టీజీపీఎస్సీ. 563 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ -1 లో గతేడాది అక్టోబర్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 6న ప్రొవిజనల్ మార్కులు రిలీజ్ చేయగా.. ఆదివారం ఉగాది పర్వదినాన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు.
మహిళలే టాప్..
టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ లో టాపర్ గా మహిళ నిలిచింది. మల్టీ జోన్ 2 కు చెందిన ఓసీ అమ్మాయికి మొత్తం 900 మార్కులకు గాను 550 వచ్చాయి. ఆ తర్వాతి రెండు స్థానాల్లో పురుషులు ఉండగా.. టాప్ 10 లో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం. 525 మార్కులకు పైగా ఆరుగురికి వచ్చాయి. 52 మంది అభ్యర్థులకు 500 లకు పైగా మార్కులు వచ్చాయి. 563 గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో అవసరమైనంత మందిని సర్టిఫికేట్ వెరికేషన్ ను కు పిలవనున్నారు. సర్టిఫికేట్ వెరికేషన్ ను కు పిలిచే వారికి వ్యక్తిగతంగా సందేశంతో పాటు వెబ్ సైట్ లోను జాబితాను పొందుపరచనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగాలు సాధించిన వారి తుది జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది.
ఏప్రిల్ 1 నుంచి ఏ ఎడాదికి ఆ ఎడాది ఫైనాన్షియల్ ఇయర్ ఆయా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల ఆధారంగా పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. అందుకు ప్రభుత్వం నుంచి ప్రతి ఎటా ఖాళీల భర్తీ ప్రతిపాదనలు రాగానే అదే ఫైనాన్షియల్ ఇయర్ లో నియామకాలు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.