
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్(35) కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ముహూర్తం నిశ్చయం అయింది. కాబోయే వధువు, వరుడు ఇద్దరు కలిసి ఫోటో షూట్‌కు కూడా వెళ్లివచ్చారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ కాబోయే నవ వరుడు కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరగనున్న అతని వివాహానికి సన్నాహాలు జరుగుతుండగా, శనివారం ఉదయం అతను తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు.. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.
పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కిరణ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. కిరణ్ ఏమైనా సూసైడ్ నోట్ రాశాడా..? స్నేహితులు, బంధువులకు ఏమైనా చెప్పాడా అని విచారిస్తున్నారు. కిరణ్ ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతను దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రామంలో చర్చించుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..