
ద్విచక్ర వాహనాల దొంగిలించే దొంగలు ఎవరైనా ఏ బైక్ దొరికితే ఆ బైక్ దొంగిలించడం కామన్…కానీ వీడు అదో టైపు.. ఆ ఒక్క కంపెనీకి చెందిన బైక్స్ మాత్రమే టార్గెట్ చేశాడు.. అదేం పైత్యమో ఏమో కానీ ఆ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి మరీ చోరీలకు పాల్పడ్డాడు.. ఫుడ్ డెలివరీ బాయ్‌లా నటిస్తూ ద్విచక్ర వాహనాలను దొంగిలించి జల్సా ఖర్చులకు అమ్ముకున్నాడు.. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఒకే కంపెనీ చెందిన వాహనాలను టార్గెట్ చేసి చోరీ చేయడం పట్ల ఆశ్చర్యానికి లోనయ్యారు.. దొంగిలించిన వాహనాలన్నీ రికవరీ చేసి రిమాండ్‌కు పంపారు.
ఈ విచిత్ర దొంగను వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు.. జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన చందులాల్ అనే యువకుడు హనుమకొండలోని గోపాలపురంలో ఓ ఇంట్లో అద్దె కుంటున్నాడు.. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం తన స్నేహితుడి లాగిన్ ఐడితో జొమాటో, స్విగ్గి లాంటి ఫుడ్ డెలివరీ సంస్థల్లో పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన ఈ యువకుడు బైక్స్ చోరీలకు ప్లాన్ చేసుకున్నాడు.. అయితే కేవలం స్ప్లెండర్ లేదంటే ఫ్యాషన్ ప్లస్ వాహనాలను మాత్రమే టార్గెట్ చేసే ఈ కేటుగాడు ఆ వాహనాలు ఎక్కడ కనబడితే అక్కడ మాయం చేసేవాడు.. ఏడాది వ్యవధిలో 18 బైక్స్ చోరీ చేశాడు.. వాటిలో కొన్ని వాహనాలు తన ఇంట్లో భద్రపరచాడు.. మరికొన్ని వాహనాలను తక్కువ ధరకు అమ్ముకొని జల్సా ఖర్చులకు ఉపయోగించుకున్నాడు.
వరంగల్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో కూడా ఇతనిపై చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇతనిపై మొత్తం 18 వాహనాల చోరీ కేసులు ఉన్నాయి.. చాకచక్యంగా పట్టుకున్న హాసన్ పర్తి పోలీసులు ఇతని చోరీల గుట్టు మొత్తం రట్టు చేశారు. ఇతడు చోరీ చేసిన 18 వాహనాల రికవరీ చేసిన పోలీసులు నిందితుని రిమాండ్‌కు పంపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..