

దేశ అంతర్గత భద్రతలోనే కాదు, దేశ సరిహద్దులోనూ డాగ్ స్క్వాడ్ల విధులు చాలా కీలకంగా మారాయి.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి భద్రతలోనూ జాగీలాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైల్వే స్టేషన్లకు తరుచూ వచ్చే బాంబు బెదిరింపులతో రంగంలోకి దిగేది ముందుగా జాగీలాలే. అంతే కాదు ఇటీవల కాలంలో డ్రగ్స్‌ను గుర్తించడంలోనూ, పేలుడు పదార్థాల ఆచూకీ కనిపెట్టడంలోనూ డాగ్ స్క్వాడ్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. అంతలా ఎప్పుడు రక్షణ రంగంలో జాగీలాలు కీ రోల్ పోషిస్తున్నాయి. హైదరాబాద్‌లోని IITA అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 72 జాగీలాలు, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధినిర్వాహణలో చేరబోతున్నాయి.
పరిస్థితులు ఎలాంటివైనా సరే… చుట్టూ ఎంత మంది ఉన్నా సరే.. తనకు చెప్పిన టాస్క్‌ను పూర్తి చేయడంలో వాటికవే సాటి.. ఆర్మీలోనైనా, పోలీస్ విభాగంలోనైనా డాగ్ స్క్వాడ్ ఉన్న ప్రత్యేకతే వేరు. సుశిక్షితులైనా సిబ్బంది ఎలా విధులు నిర్వహిస్తారో వారితో సమానంగా డాగ్ స్వ్కాడ్ తన విధులను నిర్వర్తిస్తోంది. శత్రువు ఎంతటి వారైనా సరే తన హ్యాండ్లర్ చెబితే నేల కరిచేంత వరకు కూడా వదిలిపెట్టవు. దేశ సరిహద్దుల్లో ఇప్పటికే కీలక పాత్రను పోషిస్తున్న జాగీలాల సేవలు, ఇప్పుడు రాష్ట్రాల్లోనూ అంతే ప్రాముఖ్యత పెరిగింది. పోలీస్ సిబ్బందితో సమానంగా నిందితులను పట్టుకోవడంలో కీలకంగా మారాయి. ఏదైనా మర్డర్ సీన్లో నిందితుడిని గుర్తించడానికి డాగ్ స్వ్కాడ్ సేవలు కీలకంగా మారాయి. అంతే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బందితో సరిసమానంగా డాగ్ స్వ్కాడ్ సేవలనందిస్తున్నాయి. దీంతో రోజు రోజుకు డాగ్ స్వ్కాడ్‌కు ప్రాముఖ్యత పెరుగుతుండటంతో ఎప్పటికప్పుడు జాగీలాలకు ప్రత్యేకమైన శిక్షణను ఇస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 24 వ బ్యాచ్‌కు చెందిన జాగీలాల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.. ఈ ఐఐటీఏ లో 72 జాగీలాలు గత 8 నెలలుగా శిక్షణను పూర్తి చేసుకున్నాయి. ఈ అకాడమీలో జర్మన్ షపర్డ్, లెబ్రడాల్, గోల్డెన్ రిట్రీవర్, డాబర్ మెన్, డాల్మేషన్, ఆల్సిషియన్ తదితర జాతులకు చెందిన 72 జాగీలాలు ప్రత్యేక శిక్షణను పొందాయి. శిక్షణ పూర్తి చేసుకున్న జాగీలాలకు ఇవాళ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌కు ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని జాగీలాల నుండి గౌవర వందనాన్ని స్వీకరించాడు.
మనిషి కన్నా 40 శాతం అధికంగా వాసన పసిగట్టగలవు. పోలీస్ మేధాశక్తికి నిరంతరం తోడుగా ఉండేది. నార్కోటిక్స్, ఎక్సప్లొజివ్స్, ట్రాకర్లపై ప్రత్యేక శిక్షణ, 72 జాగిలాలకు 8 నెలల పాటు శిక్షణ పూర్తిగా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజన్స్ ట్రైనింగ్ అకాడమీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిందని ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి అన్నారు. గత 20 ఏళ్లుగా జాగీలాలకు శిక్షణను ఇవ్వడంలో ఎంతో కీలకంగా ఉన్న ఈ అకాడమీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం జాగాలాలకు పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను గుర్తించడంలో కీలకంగా శిక్షణను ఇస్తున్నారని తెలిపారు.
తెలంగాణాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 360కి పైగా జాగీలాలు పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలందిస్తున్నాయి. వీటిలో ప్రత్యేకంగా డ్రగ్స్‌తో పాటు, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ తదితర మాదకద్రవ్యాలను గుర్తించడంలో కిలకమైన శిక్షణను అందించారు అకాడమీకి చెందిన ట్రైనర్స్ . ఎవరైనా కన్జ్యూమర్లు డ్రగ్స్ తీసుకున్న తరువాత వారి చేతి వేళ్లకు ఉండే గోళ్ల నుండి వచ్చే స్మెల్ ఆధారంగా గుర్తించి పట్టుకునే విధంగా వీటికి శిక్షణను ఇచ్చారు. దీంతో డ్రగ్స్ సమాచారం వచ్చిన వెంటనే డాగ్ స్వ్వాడ్ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టులలో లగేజీ తనిఖీలు చేయడంలో, ఎక్కడైనా అనుమానం వచ్చినా, బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినా, డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దింపుతున్నారు. ప్రస్తుతం నిందితులను పట్టుకోవడంలో డాగ్ స్వ్కాడ్ ఇప్పుడు కీలకంగా మారాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి