
ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే.. సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 30న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ స్కీమ్ ప్రారంభిస్తున్నారు. సూర్యాపేటలోని మట్టపల్లి టెంపుల్ నుంచి ఈ పథకం ఆరంభం అవ్వనుంది. అక్కడ పూజలు చేసి, దైనానుగ్రహంతో ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రేషన్‌కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్య ప్రకారం ఒక్కొక్కరికీ 6 కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు. తద్వారా పేదలు.. మరింత నాణ్యమైన పౌష్టికాహారాన్ని పొందినట్లు అవుతుంది.
వర్షకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి తెలంగాణ సర్కార్ క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తోంది. ఇలా వచ్చిన వడ్లను రైస్ మిల్లుల్లో మరాడించగా 8 లక్షల టన్నుల సన్నబియ్యం వచ్చినట్లు సివిల్ సప్లైస్ వర్గాల ద్వారా తెలసింది. ఇవి జిల్లాల్లోని స్టోరేజ్ కేంద్రాల్లో ఉన్నాయి. అక్కడి నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు తర్వాత రేషన్ షాపులకు తరలిస్తారు. మిల్లుల్లో మరాడిస్తున్న వడ్లతో వచ్చే సన్నబియ్యం మరో 4 నెలల వరకు సరిపోతాయని అధికారులు అంచనా. తెలంగాణ వ్యాప్తంగా 91,19,268 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారులు 2,82,77,859 మంది ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..