

తెలంగాణలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఎండలు మరింత పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36-38.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 37 డిగ్రీలకు పైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.
దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50 శాతం తగ్గిందని, దీంతో భూమిలో, గాలిలో తేమశాతం తగ్గాయని.. దేశంలో వేడి పెరగడానికి ఇదో కారణమని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. 125 సంవత్సరాల సరాసరి తో పోల్చితే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 1901 నుంచి 2025 వరకు సరాసరి తీసుకుంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రతతో పాటు వడగాలుల శాతం కూడా పెరుగుతుంది. దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత సాధారణ స్థాయి కంటే పెరిగే అవకాశం ఉంది. మధ్య తెలంగాణతో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశాలున్నాయి. దక్షిణ పెన్సిలర్ ఇండియా మొత్తం కూడా 125 సంవత్సరాల సగటు తీసుకుంటే ఈ సంవత్సరం టెన్త్ ప్లేస్ లో తెలంగాణ ఉందంటోంది వాతావరణ శాఖ.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి