

సగటున ఏడాదికి 15 మంది ప్రాణాలు మింగేస్తున్న డేంజర్ స్పాట్ ఇది. వరంగల్ – కరీంనగర్ మద్య జాతీయ రహదారి హసన్ పర్తి శివారు నుండి సీతంపేట క్రాస్ వరకు అత్యంత ప్రమాదకరంగా ప్రాణాలు మింగేస్తున్న ఈ మూల మలుపు ఇది. రక్తం రుచి మరిగిన డేంజర్ డెక్స్ పార్ట్ ని వాహనదారులు ఇక్కడి ప్రజలు స్నాక్స్ పాటుగా పిలుస్తుంటారు.. వైకుంఠపాళీ లో పాము మింగేసినట్లే ఇక్కడ వాహనదారుల ప్రాణాలను ఈ డేంజరస్ పాట మింగేస్తుంది.
తాజాగా మూడు రోజులు వ్యవధిలో ముగ్గురు ఇదే ప్రాంతంలో ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది..రెండు రోజుల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో మహేష్, పవన్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇక్కడే నిండు ప్రాణాలు కోల్పోయారు. సీతంపేట గ్రామానికి చెందిన మహేష్, పవన్ బైక్ పై వెళ్తుండగా లారీ డీ కొని అక్కడిక్కడే నిండు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. అయితే రహదారిపై కొద్దిదూరంలో శాంతినగర్ వద్ద కీర్తి అనే యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొని కీర్తి కొంతసేపు మృత్యువుతో పోరాడింది. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి.
వరుస ప్రమాదాల నేపథ్యంలో స్థానికులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.. ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు.. చిన్న చిన్న కారణాలతో వాహనదారులకు జరిమానాలు వేసి ముక్కు పిండి వసూలుచేసే రవాణాశాఖ అధికారులు, పోలీసులకు ప్రమాదాల నివారణ పై ముందు జాగ్రత్త, బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదాలకు లెక్కేలేదు… ఈ రోడ్డు గురించి తెలిసిన వారు ఎవరైనా ఈ డేంజర్ డెత్ స్పాట్ నుండి సురక్షితంగా బయటపడితే ప్రశాంతంగా ఇంటికి చేరినట్లే అని మనసులో దేవుడిని తలుచుకుంటారట. అచ్చం పాము మెలికల లాగే ఉండే ఈ రహదారిని స్థానికులు స్నేక్స్ స్పాట్ గా పిలుస్తుంటారు.
ఏళ్ల తరబడి ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎంతమంది బలవుతున్న అధికారులు ప్రజాప్రతినిధుల్లో చలనం లేదు. కేవలం ఈ ప్రాంతంలో డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాల నివారించవచ్చని స్థానికులు అంటున్నారు.