
వికారాబాద్ రామయ్యగూడ రోడ్డులో సినిమా నటి అనసూయ, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్తో జేఎల్ఎం బట్టల షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. గత నెల రోజులుగా ప్రారంభం రోజున తొమ్మిది రూపాయలకే చీర అంటూ ప్రచారం చేశారు షోరూమ్ యాజమాన్యం. దీంతో ప్రారంభం రోజున షోరూం దగ్గరకు భారీగా మహిళలు చేరుకున్నారు. ఒక్కసారిగా అంతమంది మహిళలు రావడంతో.. వారిని యాజమాన్యం, పోలీసులు సైతం కంట్రోల్ చేయలేకపోయారు. కిక్కిరిసిన జనంతో రామయ్యగూడ-వికారాబాద్ ప్రధాన రోడ్డుపై గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
గొప్ప ప్రారంభం.. నేడే కొనండి 9 రూపాయలకు ఒక చీర అంటూ విపరీతమైన పబ్లిసిటీతో మహిళలు కట్టలు తెచ్చుకుని భారీగా తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయలేక యాజమాన్యం చేతులెత్తేసింది. ఒక దశలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా.. మహిళలందరూ సమయమనం పాటించాలని యాజమాన్యం అందరికీ చీరలు అందిస్తుదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు మాట వినలేదు. ఇక మహిళలందరికీ చీరలు అందజేయలేని పరిస్థితి నెలకొనడంతో.. ఆఖరుకు ప్రారంభం రోజునే షోరూమ్ క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి