
తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలోని నడువట్టం ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లోకి చిరుతపులి ప్రవేశించడం స్థానికంగా కలకలం రేపుపింది. ఏప్రిల్ 28, రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గూడలూరు-ఊటీ జాతీయ రహదారి పక్కన ఉన్న నడువట్టం పోలీస్ స్టేషన్లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. మెళ్లగా పీఎస్ లోపలికి వచ్చి ఇన్స్పెక్టర్ కూర్చున్న గది చుట్టూ తిరిగింది. ఆ గదిలో తినడానికి ఏమైనా ఉన్నాయా అని చూసింది. అదే సమయంలో, మరొక గదిలో విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి గదిలో చిరుతపులి తిరగడం చూసి షాక్ అయ్యాడు. భయంతో శబ్దం చేయకుండా మౌనంగా అక్కడే నిలబడిపోయాడు. ఇక గది మోత్తం తిరిగి చూసి తినడానికి ఏమీ లేకపోవడంతో, చిరుతపులి తిరిగి మెట్లు దిగి, వచ్చిన దారిలోనే బయటకు వెళ్లిపోయింది. దీంతో పులి ఉందా వెళ్లి పోయిందానని తలుపు గుండా తొంగి చూశాడు. పులి వెళ్లిపోవడంతో అమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకున్నాడు. వెంటనే పీఎస్ తలుపులు మూసేసి తాళం వేశాడు.
ఆ తర్వాత ఉన్నతాధికారులతో పాటు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే చిరుత పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన దృశ్యాలు బయట ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
கூடலூர் நடுவட்டம் காவல் நிலையத்திற்குள் புகுந்த சிறுத்தை,லாவகமாக சென்று கதவை சாத்திய காவலர். @tnforestdept #TNForest #Leopard #nilgiris #ooty #yt pic.twitter.com/9iRIrcJMy9
— Srini Subramaniyam (@Srinietv2) April 29, 2025
పీఎస్లోకి చిరుతపులి ప్రవేశించడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను వీలైనంత త్వరగా పట్టుకొని.. దాని భారీ నుంచి తమను రక్షించాలని అటవీశాఖ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. జంతువులు తరచుగా నగరంలోకి రాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై అటవీ శాఖ మరింత నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..