

దాదాపు రెండు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న నటి తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ ఇప్పుడు విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బ్రేకప్ తర్వాత కూడా ఇద్దరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ వర్మ రిలేషన్ షిప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రిలేషన్షిప్ను ఒక ఐస్క్రీమ్ మాదిరిగా ఆద్యంతం ఆస్వాదించాలి. అలా చేసినప్పుడే నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండగలవు. సంతోషం, బాధ, కోపం, చిరాకు.. ఇలా ప్రతి అంశాన్ని నువ్వు స్వీకరించాల్సిదే. వీటితో పాటు ముందుకుసాగాలి’ అని విజయ్ వర్మ చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయమై తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నా జీవితంలో నేను ఎంచుకున్న దానితో నేను సంతోషంగా ఉన్నాను. కొత్త వ్యక్తులను కలవడం నాకు ఇష్టం. అదే సమయంలో ఊహించని పరిస్థితులు నన్ను పెద్దగా ప్రభావితం చేయవు. నాకు సంతోషం కలిగించే విషయాలను మాత్రమే నేను అందరికీ చెప్పగలను. ఇది నా వ్యక్తిగత, వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి నాకు సహాయపడుతుంది’ అని చెప్పుకొచ్చింది.
తమన్నా, విజయ్ తొలిసారి 2022లో కలిశారు. ఇద్దరూ ‘లస్ట్ స్టోరీస్ 2’లో కలిసి పనిచేశారు. గోవాలో జరిగిన నూతన సంవత్సర పార్టీలో తమన్నా, విజయ్ జాలీగా కనిపించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, విజయ్ వర్మ తమన్నా భాటియా మళ్ళీ ఒక అవార్డుల ప్రదానోత్సవంలో జంటగా కనిపించారు. దీని తర్వాత జూన్ 2023లో, విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు తమన్నా ఇన్ డైరెక్టుగా చెప్పుకొచ్చింది. విజయ్ తన భావాలను దాచడానికి ఇష్టపడడు కాబట్టి తమ సంబంధం గురించి బహిరంగంగా చెప్పాలని నిర్ణయించుకున్నానని తమన్నా ఒక ఇంటర్వ్యూలో వివరించింది.
సినిమా ఈవెంట్ లో తమన్నా, విజయ్ వర్మ..
View this post on Instagram
33 ఏళ్ల తమన్నా 2005 లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించింది. ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన గా వెలుగొందింది. ఇప్పటికీ హీరోయిన్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటోంది. ఇక విజయ్ 2012లో ‘చిట్టగాంగ్’ చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించాడు. గల్లీ బాయ్ సినిమా ద్వారా స్టార్ నటుడి గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
తమన్నాతో విజయ్ వర్మ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి