
Sunita Williams: సుదీర్ఘకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత, నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ ఉదయం తొమ్మిది నెలలకు పైగా భూమి గాలిని పీల్చుకున్నారు. వ్యోమగాములను స్ట్రెచర్లపై క్యాప్సూల్ నుండి బయటకు తీశారు. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల నుండి తిరిగి వచ్చే అన్ని వ్యోమగాములకు ఈ ముందు జాగ్రత్త తీసుకున్నారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయ్యింది.
తొమ్మిది నెలల సుదీర్ఘ మిషన్లో అంతరిక్షంలో ఉన్న తర్వాత భూమికి సురక్షితంగా తిరిగి వస్తున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు డాల్ఫిన్స్ నుండి హృదయపూర్వక స్వాగతం లభించింది. ఆ సమయంలో ఈ వ్యోమనౌక చుట్టూ డాల్ఫిన్లు సైతం కలియదిరిగాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ రికవరీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో.. ఆ వ్యోమనౌక చుట్టూ అధిక సంఖ్యలో డాల్ఫిన్లు చేరి సందడి చేశాయి.
The unplanned welcome crew!
Crew-9 had some surprise visitors after splashing down this afternoon.🐬 pic.twitter.com/yuOxtTsSLV
— NASA’s Johnson Space Center (@NASA_Johnson) March 18, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి