
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కేవలం వారం రోజుల పాటు అంతరిక్షంలోకి వెళ్లిన వీరు.. ఏకంగా 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు భూమిపైకి తిరిగి వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. వారిని క్షేమంగా తిరిగి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే స్పేస్ నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్లు మరికొన్ని గంటల్లో భూమిపైకి చేరుకోనున్నారు. వారు అంతరిక్ష కేంద్రంలో గడిపిన చివరి క్షణాలు అంటూ ఫోటోను షేర్ చేశారు.
ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్షం కేంద్ర నుంచి భూమ్మీదకు బయల్దేరిన సునీతా- బుచ్ లు మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ కానున్నారని నాసా ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిర్ణీత సమయం కంటే ఒక రోజు ముందుకు షెడ్యూల్ చేసినట్లు నాసా తెలిపింది.
LIVE: @NASA_Astronauts Nick Hague, Suni Williams, Butch Wilmore, and cosmonaut Aleksandr Gorbunov are packing up and closing the hatches as #Crew9 prepares to depart from the @Space_Station. Crew-9 is scheduled to return to Earth on Tuesday, March 18. https://t.co/TpRlvLBVU1
— NASA (@NASA) March 18, 2025
ఇది కూడా చదవండి: Sunita Williams: సునీత విలియమ్స్ జీతం ఎంతో తెలుసా? అంతరిక్షంలో ఉన్నందుకు అదనంగా ఎంత?