
వయసుతో సంబంధం లేకుండా ఊబకాయం సమస్యతో అధిక బరువుతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తినే ఆహారం విషయం నుంచి యోగా, వ్యాయామం వంటివి చేస్తూ బరువుని అదుపులో ఉంచుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఎక్కువ మంది ఆహారం తినే విషయంలో డైటింగ్ పాటిస్తున్నారు. ఇటువంటి వారు కొన్ని రకాల పండ్లను తినే ఆహారంలో చేర్చుకోవడం వలన ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. తక్కువ క్యాలరీలతో పాటు ఎక్కువ ఫైబర్ ఉన్న పండ్లను డైట్ లో చేర్చుకుంటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఈ రోజు ఆ పండ్లు ఏమిటో తెలుసుకుందాం..
పేదవాడి యాపిల్ జామకాయ డైట్ పాటించే వారికీ మంచి పండు. దీనిలో ఫైబర్‌తో పాటు విటమిన్ సీ, పొటాషియం అదికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జామ కాయలోని క్యాలరీలు ఉంటాయని.. దీనిలో ఉన్న ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుందని.. దీంతో ఆహారం తక్కువ తింటాం. అంతేకాదు జమకయలో ఉన్న గ్సైసెమిక్ ఇండెక్స్ .. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం జమకయని తినడం వలన ఆకలి తక్కువగా వేస్తుందని.. దీంతో తినే ఆహరం విషయంలో అదుపులో ఉంటామని చెబుతున్నారు. జామకయని నేరుగా లేదా కొంచెం ఉప్పు, కారం వేకుని తినొచ్చు.
పుచ్చకాయ : వేసవిలో దాహార్తిని తీర్చే పండు అంటే పుచ్చకాయ అని చెప్పవచ్చు. దీంతో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ ఏ, సీ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుచ్చకయలో పుష్కలంగా ఉంటాయి. కనుక పుచ్చకాయను తింటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. దీనిలోని సిట్రులిన్ అనే రసాయనం జీవక్రియను మెరుగుపరుస్తుంది. పుచ్చకాయని ఉదయం, మధ్యాహ్నం భోజనం చేసే మందు స్నాక్‌లా తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. పుచ్చకాయని ముక్కలుగా లేదా జ్యూస్ గా తీసుకోవచ్చు. కానీ ఉప్పు కానీ, చక్కెర వేసుకుని కానీ తినొద్దు అని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
బొప్పాయి పండు: బొప్పాయి పండులో విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అనేకాదు దీనిలోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. బొప్పాయిలో నీటి, పైబర్ శాతం అధికంగా ఉంటుంది. దీంతో కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కనుక ఈ బొప్పాయి పండుని కూడా ఉదయాన్నే లేదా భోజనం చేసిన తర్వాత తినొచ్చు
యాపిల్ : యాపిల్‌లో 52 క్యాలరీలు ఉన్నాయి. అంతేకాదు దీనిలో ఫైబర్, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ఫైబర్ ఎక్కువ తినాలనే కోరికని అదుపులో ఉంచుతుంది. దీనిలోని సహజ చక్కెరలు స్వీట్ తినాలనే కోరికను తగ్గిస్తాయని అంటున్నారు. యాపిల్ ను ఉదయం, సాయంత్రం సమయంలో ముక్కలుగా లేదా స్నాక్‌గా తీసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఆరెంజ్ : ఇందులో విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్‌తో పాటు అధిక మొత్తంలో కేలరీస్ ఉంటాయి. దీనిలో ఉన్న విటమిన్ సీ కొవ్వును కరిగిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయం, సాయంత్రం అరేంజ్ ని నేరుగా లేదా చక్కర లేని జ్యూస్ గా తీసుకోవచ్చు.
మామిడి పండు : మామిడి పండు పండ్లలో రారాదు. ఈ సీజన్లో లభించే ఈ పండులో విటమిన్ ఏ, సీ, ఫైబర్, సహజ చక్కెరలతో పాటు అదిక మొత్తంలో క్యాలరీలున్నాయి. దీంతో ఈ మామిడి పండుని తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. స్వీట్ తినాలనే కోరిక అదుపులో ఉంటుంది. అయితే మామిడి పండుని తక్కువగా తింటే బరువు అదుపులో ఉంటుందని వెల్లడిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో నేరుగా లేదా స్మూతీగా చేసుకోని తినవచ్చు అని చెప్పారు.
దానిమ్మ పండు: ఈ దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఫైబర్, ఐరన్‌తోపాటు అధిక మొత్తంలో క్యాలరీలున్నాయి. దీంతో దానిమ్మని తింటే జీవక్రియలతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో తక్కువ క్యారీలు ఉండడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. దానిమ్మని కూడా భోజనానికి ముందు నేరుగా లేదా సలాడ్ రూపంలో తినవచ్చు.
అరటి పండ్లు: అరటి పండు తినడం వల్ల చాలా సేపు ఆకలి వేయదని నిపుణులు అంటున్నారు. దీనిలో ఎక్కువ మొత్తంలో క్యాలరీలు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్లు ఉన్నాయని చెప్పారు. అయితే, అరటిపండును బ్రేక్‌ఫాస్ట్ లేదా ప్రీ వర్కౌట్ స్నాక్‌గా తీసుకోవాలని.. లేదా స్మూతీ, ఓట్స్‌లో వేసి తినాలని సూచిస్తున్నారు.
అనాస పండు: పైనాపిల్‌లో విటమిన్ సీ, మాంగనీస్‌తో పాటు క్యాలరీలున్నాయి. అంతేకాదు దీనిలోకి బ్రోమిలీన్ అనే ఎంజైమ్ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సాయపడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండడంతో ఎక్కువ సేపు కడుపు నిండినట్లు ఉంటారు.
సపోట : ఇందులో విటమిన్ సీ, సహజ చక్కెరలు క్యాలరీలతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉన్న పీచు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీనిలో సహజ చక్కెరలు స్వీట్ క్రేవింగ్స్ తగ్గిస్తుంది. దీనిని ఉదయం, సాయంత్రానికి ముందు నేరుగా లేదా స్మూతీగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
అయితే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ పండ్లను తినే ఆహారంలో చేర్చుకునే సమయంలో కొన్ని నట్స్, చిరు ధాన్యాలను కూడా తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని చెబుతున్నారు. పండ్లు తినడం ఆరోగ్యానికి మేలు.. అయితే అధికంగా తింటే షుగర్ లెవెల్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే పండ్లను ఇంతే సమయంలో కొన్ని నియమాలను పాటించాలని సుసిస్తున్నారు. పోషకాహార నిపుణులు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)