
వేసవి కాలం వచ్చేసింది. ఈ సమయంలో శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. తినే ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఇది అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండే సీజన్. కనుక వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినేవారు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ రోజు ఈ సీజన్లో ఎండుద్రాక్షలను ఎలా తినాలో తెలుసుకుందాం..
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మార్కెట్లో అనేక రకాల ఎండుద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనేక రకాలుగా తినవచ్చు. వేసవిలో ఎండుద్రాక్షలను తినాలనుకుంటే వాటిని నానబెట్టి.. అప్పుడు తినాలి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నిజానికి ఎండుద్రాక్ష స్వభావం వేడిని కలుగజేస్తుంది. కనుక వీటిని నార్మల్ గా తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేసవిలో ఈ డ్రై ఫ్రూట్ తినేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం..
రోజుకు ఎన్ని ఎండుద్రాక్షలు తినాలంటే
ఎండుద్రాక్షలో ఇనుము, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. ఎండుద్రాక్ష పురుషుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జైపూర్ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ.. పిల్లలు లేదా పెద్దలు ఎవరైనా వేసవిలో కూడా 10 ఎండుద్రాక్షలు తినవచ్చని చెప్పారు. అయితే వీటిని నానబెట్టి తినడం తప్పని సరి అని చెబుతున్నారు. మీరు రోజుకి పది కంటే ఎక్కువగా తింటే అది మీ ఆరోగ్యానికి చాలా హానికరం.
ఇవి కూడా చదవండి
ఎండుద్రాక్ష నీరు
వేసవిలో మీరు ఎండుద్రాక్షలను తినాలనుకుంటే వాటిని అలాగే తినకండి. వాటిని నీటిలో నానబెట్టిన తర్వాత తినండి. ఎండుద్రాక్షలను రాత్రంతా శుభ్రమైన నీటిలో నానబెట్టి.. ఆపై నీటిని వడకట్టి ఆ నీటిని త్రాగాలి. ఎండుద్రాక్ష నీరు కడుపు, జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎండుద్రాక్ష నీరు త్రాగేటప్పుడు సమయం, పరిమాణాన్ని గుర్తుంచుకోండి.
ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీరు త్రాగటం మంచిది. ఇది మొత్తం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినకూడదు. మీరు నానబెట్టిన ఎండుద్రాక్షలను సలాడ్ మీద చల్లుకోవడం ద్వారా కూడా తినవచ్చు.
బరువు నియంత్రణ
నానబెట్టిన ఎండుద్రాక్షలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అనారోగ్యకరమైన చిరుతిండికి బదులుగా మీరు ఎండుద్రాక్ష తినవచ్చు. వేసవిలో నానబెట్టిన ఎండుద్రాక్షలను తింటే శరీరం పూర్తిగా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఎండుద్రాక్షలో విటమిన్ సి, బి-కాంప్లెక్స్ విటమిన్లు చాలా ముఖ్యమైనవి. ఇందులో ఫినాలిక్ రసాయనాలు ఉన్నాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు కూడా. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బలమైన రోగనిరోధక శక్తి అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..