

మే నెలలో భారతదేశంలో ఎండలు మండిస్తాయి. అదే సమయంలో మే నెలలో వివిధ ప్రదేశాలలో అనేక అద్భుతమైన ఉత్సవాలు, పండుగలు కూడా జరుగుతాయి. ఈ ఉత్సవాలు మన దేశ వైవిధ్యమైన సంస్కృతికి ప్రతిబింభంగా నిలుస్తాయి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం నుంచి ప్రత్యక్ష సంగీతం, సాంప్రదాయ నృత్య ప్రదర్శనల వరకు ప్రతి ఒక్కరికీ ఏదోక మంచి అనుభవాన్ని ఇస్తాయి. ఈ పండుగలు, ఉత్సవాలలో మీరు రుచికరమైన ఆహారాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని కూడా పొందుతారు. మీరు ఈ పండుగలలో పాల్గొనాలనుకుంటే మే నెలలో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
భారతదేశం వైవిధ్యం కలిగిన దేశం. విభిన్న సంస్కృతులకు నెలవు. ఇక్కడ అందం మాత్రమే కాదు.. ఏదైనా మతపరమైన పండుగ జరిగినప్పుడల్లా, ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. అదే సమయంలో సాంస్కృతిక ఉత్సవాలకు కూడా వాటి సొంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు మన దేశంలో మే నెలలో ఎంతో వైభవంగా జరుపుకునే పండుగల గురించి తెలుసుకుందాం..
ఊటీ వేసవి పండుగ
మండే వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఊటీకి వెళ్లడం గొప్ప ఆలోచన. మే నెలలో ఇక్కడికి చేరుకోవడంతోనే మీకు కొత్త ఉత్సాహం లభిస్తుంది. ఎందుకంటే మే నెలలో ఊటీలో వేసవి పండుగ ఉంటుంది. పుష్ప ప్రదర్శన ఇక్కడకు వెళ్ళడం అంతర్గత ప్రశాంతతను ఇస్తుంది. ఊటీ సహజ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించడం కష్టం.. మే నెలలో వేసవి పండుగ సందర్భంగా.. సహజ సౌందర్యాన్ని చూడడానికి రెండు కనులు చాలవు అనిపిస్తుంది. ఇక్కడ అనేక విభిన్న కార్యకలాపాలను నిర్వహిస్తారు.
నాగాలాండ్ మోట్సు పండుగ
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో మే నెల విశ్రాంతి, ఆనందానికి నెల. వాస్తవానికి ఈ సమయంలో పంట కోసిన తర్వాత.. ప్రజల పని తగ్గుతుంది. ఆ తర్వాత మోట్సు పండుగ జరుపుకుంటారు. దీనిలో మీరు పాల్గొనడం ద్వారా ఆనందించవచ్చు. ఈ ఉత్సవంలో శాస్త్రీయ సంగీతం, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ముఖ్యంగా సంగ్పాంగ్టు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
మౌంట్ అబూ వేసవి ఉత్సవం
మౌంట్ అబూ ఒక హిల్ స్టేషన్. ఇది వేసవికి గొప్ప గమ్యస్థానం. మీరు కూడా ఇక్కడికి వెళ్లాలనుకుంటే మే నెలలో వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. బుద్ధ పూర్ణిమ రోజున ఇక్కడి దృశ్యం అద్భుతంగా ఉంటుంది. నైని సరస్సు ఒడ్డున నిర్వహించే ఆచారాల పరిమళం గాలిలో నిలిచి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఉత్సవంలో నైని సరస్సులో పడవ పందేలు, షామ్-ఎ-కవ్వాలి వంటి సంగీత సాయంత్రం, ఈ ప్రాంత సంస్కృతిని ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.
రాజస్థాన్ బంగంగా పండుగ
రాజపుత్రుల భూమిగా పిలువబడే రాజస్థాన్.. ఇది గొప్ప వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. మే నెలలో ఇక్కడ జరిగే బన్గంగా ఉత్సవాన్ని తప్పకుండ చూడాలి. వైశాఖ పూర్ణిమ నాడు జరుపుకునే ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ బన్గంగాలో పవిత్ర స్నానం చేయడం వల్ల మీకు శక్తి లభిస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తారు.
ఈ ప్రదేశాలకు గంగా దసరా ప్రత్యేకమైనది
వేసవిలో వచ్చే గంగా దసరా ఈసారి జూన్‌లో వస్తోంది. ఈ పండుగ ప్రతి హిందువుకి త్యేకమైనది. ఈ సమయంలో ప్రతి గంగా ఘాట్ వద్ద మీరు అద్భుతమైన దృశ్యాన్ని చూస్తారు. అయితే హరిద్వార్, బనారస్, రిషికేశ్‌లకు వెళ్లడం మీకు చాలా మంచి అనుభవంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..