
వేసవి ఎండలు రోజురోజుకీ ముదురుతున్నాయి. తీవ్రమైన వేడిలో ఎటు వెళ్లాలన్నా భయం కమ్మేస్తుంది. ఎండలో బయటకు వెళ్ళినప్పుడల్లా ఎనర్జీ గ్రాఫ్ క్రమంగా తగ్గిపోతుంది.
ఈ సమయంలో శరీరానికి సరైన మొత్తంలో నీరు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. దీని కోసం తగినంత నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే మీ వంటగదిలో ఉన్న ఈ మూడు పదార్ధాలతో కమ్మని సమ్మర్ డ్రంక్ తయారు చేసుకోవచ్చు.
అల్లం, పసుపు నీటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగగలిగితే సమ్మర్లో మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక గ్లాసు నీటిలో కొద్దిగా పసుపు పొడి లేదా పసుపు పేస్ట్ కలపాలి. కొన్ని అల్లం ముక్కలను కోసి లేదా చూర్ణం చేసి అందులో వేసుకోవాలి. అవసరమైతే మీరు దానికి తేనె కూడా జోడించవచ్చు. దీన్ని బాగా కలిపి ఉదయం నిద్ర లేచిన తర్వాత తాగితే బలేగా పనిచేస్తుంది. కాస్త వేడిగా తాగితే అలసిపోయినట్లు అనిపించదు.
ఈ డ్రింక్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏదైనా నొప్పి ఉంటే తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడుతున్న వారు ఈ జ్యూస్ తాగడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. ఈ డ్రింక్ అజీర్ణం నుండి ఉపశమనం కలిగించడానికి కూడా బలేగా పనిచేస్తుంది.