
ఈ మధ్య కాలంలో చాలా మంది నేచర్ అందాలను వీక్షించేందుకు అడవుల బాట పడుతున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ట్రిప్పులు కూడా ఉంటున్నాయి. అయితే, ఇలా వెళ్లినప్పుడు మీరు పొరపాటున కూడా ఈ మొక్క కనిపిస్తే దాని జోలికి వెళ్లకండి. ఇది ఎంత డేంజరంటే దీన్ని ముట్టుకున్న వారికి ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం ఉండదు. పూర్వం దీన్ని శపించే మొక్కగా పిలిచేవారు. దీని పేరే గింపీ గింపీ. ఈ మొక్క గురించి చెప్తే దీని గురించి తెలిసిన వారు ఇప్పటికే దీని ఆగ్రహానికి గురైన వారికి వెన్నులో వణుకు పడుతుంది. మరి అంతలా భయపెట్టే ఈ మొక్క గురించి కొన్ని భయం గొలిపే విషయాలివి.
ఈ మొక్క చూడటానికి అందంగా ఉంటుంది. దీనికి హార్ట్ షేప్‌లో పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. దాదాపు రావి ఆకుల్ని పోలి ఉంటాయి. దీన్ని సూసైడల్ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ మొక్క ముళ్ల విషయం తెలియక పూర్వం దీన్ని చూసిన గిరిజనులు ఇది శపిస్తుందని అనుకునేవారు.
ఈ ఆకులపై కంటికి కనిపించనంత చిన్న సన్నటి ముళ్లు ఉంటాయి. తేలు కుడితే ఎలా నొప్పి వస్తుందో… అలాంటి నొప్పి ఈ ముళ్లు గుచ్చుకుంటే కలుగుతుంది. ఈ ముళ్లు గుచ్చుకుంటే… బయటకు తియ్యడం కష్టం. అంత చిన్నగా ఉంటాయి. ఆ ముళ్లు తీసేదాకా నొప్పి తగ్గదు. ఈ మొక్కలు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచంలోని భయంకరమైన మొక్కల్లో ఇదీ ఒకటి.
ఈ మొక్క సైంటిఫిక్ పేరు డెండ్రోక్నైడ్ మొరాయిడెస్. ఈ ఆకుల ముళ్లలో ఒక రకమైన విషం ఉంటుంది. ఆ ముళ్లు గుచ్చుకోగానే… ఆ విష మన శరీరంలో కలుస్తుంది. పాములు, తేళ్ల విషం ఎంత ప్రమాదకరమో… దీని విషం అంతకన్నా ప్రమాదకరం.
గింపీ గింపీ మొక్క ఆకులు టచ్ చేస్తే… ఇంకేమైనా ఉందా… ప్రాణాపాయమే. ఆ ఆకులను ముట్టుకుంటే కలిగే నొప్పి, బాధ అంతా ఇంతా కాదు. ముట్టుకున్న వ్యక్తి ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారు. ఆ స్థాయిలో దీని తీవ్రత ఉంటుంది.
క్వాన్స్లాండ్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్‌కి చెందిన సీనియర్ కన్సర్వేషన్ ఆఫీసర్… ఎర్నీ రైడర్… ఈ మొక్క ఆకుల్ని టచ్ చేసి… ఆ నొప్పి ఏ రేంజ్లో ఉంటుందో అనుభవం పొందారు. ఆయన ఆకుల్ని ముట్టుకున్నాక… 2 సంవత్సరాలపాటూ ఆ నొప్పి ఉంది.
నిజానికి 2 ఏళ్లంటే తక్కువే. ఎందుకంటే… ఆ ముళ్లు శరీరం నుంచి బయటకు వచ్చే వరకూ నొప్పి పోదు. కొన్నేళ్లపాటూ అలాగే ఉండే అవకాశం ఉంటుంది.
నిజానికి ఆకుల్ని ముట్టుకున్న నెక్స్ట్ రెండు గంటల్లో నొప్పి భరించలేక… ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. కొన్ని సార్లు ఎరుపు రంగులో దద్దుర్లు కూడా వస్తాయి. ఇవన్నీ భరించలేకే చనిపోవాలని అనుకుంటారట.
ఈ ఆకులు నీరు లేని సమయంలో ఎండిపోతాయి. అలాగని ఎండిన ఆకులను ముట్టుకున్నా ప్రమాదమే. ఏ సమయంలోనైనా సరే ఒక్క ముల్లు శరీరానికి గుచ్చుకున్నా భరించలేం. దీనికి ట్రీట్మెంట్లు రకరకాలవి ఉన్నాయి గానీ అవన్నీ తాత్కాలికంగా ఉన్నాయే తప్ప పర్మనెంట్‌గా పరిష్కారం చూపించలేకపోతున్నాయి.