
సినిమా తారలు తమ సమస్యలను బయటకు చెప్పుకోరు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తమ అనారోగ్య సమస్యలను బయట పెట్టడానికి అసలు ఇష్టపడరు. ఎందుకంటే దీని వల్ల తమ సినిమా కెరీర్ కు సమస్యలు వస్తాయన్నది వారి అభిప్రాయం. అదే సమయంలో మరికొందరు సినిమా తారలు ధైర్యంగా తమ సమస్యలను చెబుతారు. అంతేకాదు అందరికీ తెలిసేలా తమ అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తారు. తాజాగా సీనియర్ నటి సుహాసిని కూడా అదే చేశారు. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజి బిజీగా ఉంటున్నారు. తెలుగులోనే కాదు ఇతర దక్షిణాది భాషల్లోనూ నటిగా బిజీగా ఉంటున్నారు సుహాసిని. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదే సమయంలో తనకున్న అనారోగ్య సమస్యలను బయట పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఇవి కూడా చదవండి
‘నాకు టీబీ సమస్య ఉంది. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత కూడా భయంతో అందరి దగ్గర దాచాను. పరువు పోతుందని భయపడ్డాను. ఎవ్వరికీ తెలియకుండానే ఆరు నెలలు చికిత్స తీసుకున్నాను. కొన్నాళ్ల తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయాలని, అందరిలో టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను’ అని చెప్పుకొచ్చారు సుహాసిని.
అలనాటి అందాల తారలు ఒకే ఫ్రేమ్ లో.. సహ నటి ఖుష్బూ తో సుహాసిని
కాగా సుహాసినికి ఆరేళ్ల వయసులోనే టీబీ ఉందని బయటపడిందట. ఆ తర్వాత కొన్నాళ్లు అంతా ఓకే అనుకున్నా మళ్లీ 36 ఏళ్ల వయసులో మళ్లీ టీబీ తిరగ బెట్టిందట. ఈ కారణంగా సుహాసిని ఒక్కసారిగా బరువు తగ్గిపోయిందట. అంతేకాదు తనకు వినికిడి సమస్య కూడా మొదలయ్యిందట. అయితే చికిత్స తీసుకోవడంతో క్రమంగా సమస్య తగ్గుముఖం పట్టిందట.
భర్త మణిరత్నంతో కలిసి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..