
ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు సినీరంగంలోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మీరా జాస్మిన్, అన్షు అంబానీ, లయ, శ్రీదేవి విజయ్ కుమార్ వంటి హీరోయిన్స్ మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సైతం రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. తాజాగా బుల్లితెరపై ఓ రియాల్టీ షోలో హీరో జేడీ చక్రవర్తితో కలిసి సందడి చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే అందాల రాశి రంభ. ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటిన రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫ్యామిలీ ఫోటోస్ పంచుకుంటుంది.
ఇటీవలే తమిళంలో ఓ టీవీ షోలో పాల్గొంది రంభ. ఇప్పుడు తెలుగులోకి సైతం రీఎంట్రీ ఇస్తుంది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షోలో ఓ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చింది రంభ. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో జేడీ చక్రవర్తితో కలిసి ఎంట్రీ ఇచ్చింది రంభ. ఆ సమయంలో బొంబాయి ప్రియుడు సినిమాలోని పాటను వేశారు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ రంభ కోసం ఓ సాంగ్ పాడాడు. ఈ షోలో రంభ తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంది. అనంతరం సుధీర్ తో కలిసి బావగారు బాగున్నారా సినిమాలోని ఓ సీన్ స్కిట్ వేశారు.
అలాగే చాలా కాలం తర్వాత జేడీ చక్రవర్తి, రంభ కలిసి కామెడీ పంచులతో అలరించారు. 90వ దశకంలో రంభ స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దాదాపు పదేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. 1992లో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రంభ.. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.
ఇవి కూడా చదవండి

దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరో..

TCSలో జాబ్ వదిలేసి సినిమాల్లోకి .. రామ్ చరణ్ మూవీతో క్రేజ్..

ఈ స్టైలిష్ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయినా..?

అభిషేక్ బచ్చన్‌తో ఎంగేజ్మెంట్.. చిత్రహింసలు పెట్టిన భర్త.. ఎవరంటే
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..
Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..
Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..