
స్ట్రాబెరీలు తీసుకోవడం వల్ల ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే బరువు సులభంగా తగ్గిపోతారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు తినాలి. అంతేకాదు ఎండ కాలం ఈ పండు తీసుకోవడం వల్ల మంచి హైడ్రేషన్ అందిస్తుంది. ఇది మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. మన శరీరానికి తగిన హైడ్రేషన్ అందిస్తుంది. స్ట్రాబెర్రీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు తగ్గడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.. ఎందుకంటే ఇది ఆకలిని నియంత్రించడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇది కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించే ఆహారం కోసం స్ట్రాబెర్రీలను తీసుకోవడం బెస్ట్ చాయిస్ అంటున్నారు నిపుణులు. స్ట్రాబెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షిస్తాయి.
స్ట్రాబెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు, ఎలాజిక్ ఆమ్లం వంటివి ఈ హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కేలరీలను బర్న్ చేయడానికి మరింత అనుకూలంగా చేస్తాయి. స్ట్రాబెరీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. ఈ పండు క్యాలరీలు బర్న్ చేసే కెపాసిటీ కలిగి ఉంది. అంతేకాదు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉంటుంది.
స్ట్రాబెర్రీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటాయి. ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో, రోజంతా సంతృప్తి భావనను కొనసాగించడంలో సహాయపడుతుంది. స్ట్రాబెరీ స్మూథీ రూపంలో తీసుకోవచ్చు లేదా జ్యూస్ లా కూడా తయారు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..