
హైదరాబాద్, మార్చి 13: కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (సీజీఎల్) పరీక్ష 2024 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) గురువారం (మార్చి 13) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కింది పీడీఎఫ్ ఫైల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సీజీఎల్ 2024 పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లోని 18,174 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా జనవరి 18, 19, 20, 31 తేదీల్లో టైర్ 2 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత ఏడాది టైర్ 1 పరీక్షలు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించారు.
ఎస్ఎస్సీ సీజీఎల్ తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్ఎస్సీ ఎంటీఎస్ తుది ఫలితాలు విడుదల
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ (MTS) ఎగ్జామ్ (టైర్ 1) 2024 తుది ఫలితాలు కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) గురువారం (మార్చి 13) విడుదల చేసింది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటనను జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో టైర్ 1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మొత్తం 9,583 మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు టైర్ 1 పరీక్షలో అర్హత సాధించిన వారిని టైర్ 2 పరీక్షకు పిలుస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. హవల్దార్ ఖాళీలను ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇవి కూడా చదవండి
ఎస్ఎస్సీ ఎంటీఎస్ టైర్ 1 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.