
హైదరాబాద్, జనవరి 21: స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) జనవరి 18న షిఫ్ట్ 2లో జరగవల్సిన ఎస్ఎస్సీ సీజీఎల్ టైపింగ్ టెస్ట్‌ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కొన్ని సాంకేతిక లోపాల కారణంగా వాయిదా ఈ టెస్ట్ వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను తిరిగి జనవరి 31వ తేదీన నిర్వహించనున్నట్లు రీషెడ్యూల్ చేసింది. ఈ షిఫ్ట్‌లో పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ తిరిగి.. జనవరి 31వ తేదీన టైపింగ్ టెస్ట్ (డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్)కు హాజరు కావాల్సి ఉంటుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు అధికారిక నోటీసును జారీ చేసింది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ జనవరి 27వ తేదీన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకనటలో కమిషన్ పేర్కొంది. జనవరి 27వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు టెస్ట్ ప్రారంభమవుతుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవచ్చు.
కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి అధికారిక గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాల గురించి తెలియని వారుండరు. ఈ కాలేజీ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా మారిన రాష్ట్ర తొలి మహిళా యూనివర్సిటీగా అధికారిక గుర్తింపు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గెజిట్‌లో ప్రచురించింది. నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదనలు వచ్చినా శాసనసభలో యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం బిల్లును ప్రవేశపెట్టలేదు. దీంతో యూజీసీ గుర్తింపు కరువైంది. మూడేళ్ల క్రితం డిగ్రీలో చేరిన విద్యార్థులకు మహిళా యూనివర్సిటీ పేరుతో డిగ్రీలు ఇవ్వకపోవడంతో వారికి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని గతేడాది అక్టోబరులో భావించిన ప్రభుత్వంవ వెంటనే స్పందించి తెలంగాణ మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా మార్చింది.
గత డిసెంబరులో శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి.. అనంతరం చకచకా జనవరి 17న వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని అధికారికంగా గుర్తిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. అనంతరం యూనివర్సిటీ గుర్తింపు కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు జనవరి 18న ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లు ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ ఓ ప్రటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.