“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటేష్, మహేష్ అన్నాదమ్ముల్లుగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం ఎప్పుడూ నవ్వుతూ.. అందరిక మంచి కోరే వారి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. అయితే ఈ తండ్రి పాత్ర కోసం తొలుత సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అప్రోచ్ అయ్యారట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ పాత్ర ఆయన చేస్తే బాగుంటుందని.. చెన్నై వెళ్లి రజినీకాంత్‌ను స్వయంగా కలిసి కథ వినిపించారట. అయితే, ఆ సమయంలో రజినీకాంత్ గారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందున, ఈ ముఖ్యమైన పాత్రను చేయలేనని సున్నితంగా తిరస్కరించారు. ఒకవేళ ఆయన ఆరోగ్యం సహకరించి ఉంటే, ఈ పాత్రను తప్పకుండా అంగీకరించి ఉండేవారని శ్రీకాంత్ అడ్డాల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “రెలంగి మావయ్య” పాత్రకు రజినీకాంత్‌ను ఎలా ఊహించుకున్నావ్ అడ్డాల అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు సినిమాలోని ప్రధాన పాత్రలైన పెద్దోడు, చిన్నోడులకు పేర్లు పెట్టకపోవడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. ప్రేక్షకులు తమను తాము పాత్రలతో సులువుగా పోల్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇది జరిగిందని దర్శకుడు చెప్పారు. ఒక పేరు పెడితే, అది కేవలం ఆ పేరు ఉన్నవారికే పరిమితం కావచ్చని, కానీ “పెద్దోడు, చిన్నోడు” అనేవి ఇళ్లలో సాధారణంగా వాడే పిలుపులు కావడంతో అవి విశ్వవ్యాప్తంగా ఉంటాయని శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. అయితే, సీత, గీత వంటి కొన్ని పాత్రలకు మాత్రం రైమింగ్ కోసమో, కథకు అవసరమో కాబట్టి పేర్లు పెట్టారు.
Also Read: ‘అలాంటి నటుడ్ని నా లైఫ్‌లో చూడలేదు..’ చిన్న నటుడ్ని తెగ పొగిడేసిన మహేశ్
