
దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకూ జానకీ రాముల కళ్యాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. లోకాభిరాముడు, సుగుణాభిరాలు అయిన శ్రీ సీతా రాముల కళ్యాణమహోత్సవం వీక్షించాలని, శ్రీ సీతా రామచంద్ర ప్రభువుల ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే శ్రీ రామ నవమి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారంగా శ్రీరాముని భావిస్తారు. మానవుడుగా జన్మించి దేవుడిగా మారి పూజలను ఆడుకుంటున్న శ్రీ రాముడి జననాన్ని గుర్తుచేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి జరుపుకుంటారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 6న రామ నవమిని జరుపుకోనున్నారు.
ఈ రోజున దేవాలయాలలో మాత్రమే కాదు గల్లీ గల్లీ లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సీతారాముల కళ్యాణం చేస్తారు. శ్రీరాముని ఊరేగింపు జరుగుతుంది. ఈ రోజున శ్రీరాముడిని పూజించే వారు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు ఈ రోజు తెలుసుకుందాం..
శ్రీ రామ నవమి రోజున ఏమి చేయాలంటే
- ఉదయాన్నే లేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించండి.
- శ్రీరాముని పట్ల భక్తితో చేతులు జోడించి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేయండి
- మనస్సుని నిర్మలంగా, స్వచ్ఛమైన ఆలోచనలతో ఉంచుకోండి. రోజంతా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి.
- శ్రీ రామ నవమి రోజున శ్రీ హనుమంతుడిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
- హనుమాన్ చాలీసా, బజరంగ్ బాన్, సుందరా కాండను పఠించండి .
- హనుమంతుడికి శనగలు, బెల్లం నైవేద్యంగా సమర్పించండి. సింధూరం దిద్దండి
- ఈ రోజున పేదలకు ఆహారం, బట్టలు దానం చేయండి.
- రోజంతా “శ్రీ రామ” నామాన్ని జపిస్తూ, ధ్యానంలో రామ దర్బార్ను స్మరించుకోండి.
- ఈ రోజున, శ్రీరాముడికి పంచామృతంతో స్నానం చేయించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించండి.
- శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముని మంత్రాలను జపించండి.
ఇవి కూడా చదవండి
శ్రీ రామ నవమి రోజున ఏమి చేయకూడదంటే
- శ్రీ రామ నవమి రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి తామసిక పదార్థాలు తినకూడదు. ఈ రోజున సాత్విక ఆహారం తినాలి.
- ఈ రోజున ఎవరూ ఎవరినీ అవమానించకూడదు లేదా అసభ్యకరమైన భాషను ఉపయోగించకూడదు.
- శ్రీ రామనవమి రోజున అబద్ధం చెప్పవద్దు సత్యాన్ని అనుసరించాలి.
- ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకుండా ఉండాలి.
- ఈ రోజున ఇంటికి వచ్చే ఏ వ్యక్తినీ ఖాళీ చేతులతో వెనక్కి పంపవద్దు. ఇలా చేయడం వలన శ్రీరాముడు కోపంగా ఉండవచ్చు. కనుక ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు