
హిందువులు పవిత్రంగా జరుపుకునే శ్రీ రామ నవమి పండుగ దగ్గర పడుతోంది. రాములోరి కళ్యాణం కోసం యావత్ భక్త గణం ఎదురుచూస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీరాముడు, హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి, జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రీ రామ నవమి ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు. శ్రీ రాముడికి చాలా ఇష్టమైన విషయాలు ఉన్నాయి. శ్రీ రామ నవమి రోజున రామయ్యకి ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవడం వలన రాముడి ఆశీస్సులు మాత్రమే కాదు హనుమంతుడు, లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి.
పసుపు దుస్తులు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ రామ నవమికి ముందు ఎవరైనా పసుపు వస్త్రం లేదా కొంత మొత్తంలో బంగారాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదం అని నమ్మకం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. భక్తుల ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉండేలా అనుగ్రహం కరుపిస్తుంది.
శంఖం
శ్రీ రామ నవమికి ముందు శంఖం కొని ఇంటికి తీసుకురండి. ఇంట్లోని పూజ గదిలో శంఖాన్ని ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కొందరు దేవుళ్ళ పూజలో శంఖం లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణింపబడుతున్నది. అటువంటి దేవుళ్ళలో ఒకరు హనుమంతుడు. కనుక శ్రీ రామ నవమికి ముందు ఇంటికి శంఖాన్ని తీసుకురండి.
ఇవి కూడా చదవండి
కాషాయ జెండా
రామ నవమికి ముందు కాషాయ జెండాను కొని మీ ఇంటికి తీసుకురావాలి. దీన్ని రామనవమి శుభ సందర్భంగా మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటి వైపు సానుకూల శక్తి ఆకర్షితులవుతుంది. ప్రతికూల శక్తి నశిస్తుందని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు