
హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2025 ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు విజభేరి మోగించాయి. జూనియర్ ఇంటర్ MPC గ్రూపులో 470 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 468తో 103 మంది ఉత్తీర్ణత పొందారు. 467 మార్కులు ఆపైన 462 మంది విద్యార్ధులకు, 466 మార్కులు ఆపైన 1073 మంది విద్యార్ధులకు, 460 మార్కులు ఆపైన 4490 విద్యార్ధులకు, 450 మార్కులు ఆపైన 8479 మంది శ్రీచైతన్య విద్యార్థులు సాధించారు. జూనియర్ ఇంటర్ BiPC గ్రూపులో 440 మార్కులకుగాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 438 మార్కులుతో ఏకంగా 26 మంది ఉత్తీర్ణత సాధించారు. 437 మార్కులు ఆపైన 136 మంది, 436 మార్కులు ఆపైన 304 మంది, 435 మార్కులు ఆపైన 459 మంది, 430 మార్కులు ఆపైన 1495 మంది శ్రీచైతన్య విద్యార్థులు సాధించి సత్తా చాటారు.
ఇక సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు గాను 996 స్టేట్ టాప్ మార్కులు సాధించారు. 995 మార్కులు ఆపైన 7 గురు, 994 మార్కులు ఆపైన 46 మంది, 990 మార్కులు ఆపైన 610 మంది, 985 మార్కులు ఆపైన 1776 మంది, 980 మార్కులు ఆపైన 3050 మంది,950 మార్కులు ఆపైన 9697 మంది శ్రీచైతన్య విద్యార్థులు సాధించారు. ఇప్పటికే విడుదలైన జేఈఈ మెయిన్స్ 2025లో 300కి 300 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరిలో రెండు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులతో పాటు, ఆలిండియా ఓపెన్ కేటగిరిలో టాప్ 10లోపు 4 ర్యాంకులు, 100 లోపు ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 31 ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డ్ సృష్టించారు శ్రీచైతన్య విద్యార్థులు. జేఈఈ మెయిన్‌లో అత్యధిక ర్యాంకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శ్రీచైతన్య విద్యార్థులకే రావడం పట్ల శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మశ్రీ హర్షం వ్యక్తం చేశారు. రేపటి ఐఐటీ అడ్వాన్స్డ్, నీట్ పరీక్షల్లోనూ నంబర్ వన్ ర్యాంకులు సాధిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సుష్మశ్రీ మాట్లాడుతూ… శ్రీచైతన్య సృష్టించిన పటిష్టమైన ప్రోగ్రాములు, సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి ఆధ్యాపకుల శిక్షణతో ఇంటర్మీడియేట్‌లో సబ్జెక్ట్స్ పై మా విద్యార్థులకు కాన్సెప్ట్యువల్‌గా పట్టు సాధించడంతో జాతీయస్థాయి పోటీపరీక్షల్లో మా విద్యార్థులు టాపర్స్‌గా నిలుస్తున్నారని అన్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లనే ఈ ఇంటర్మీడియెట్ మార్కులు సాధ్యమయిందని, దీనితో పాటు రాబోయే రిజల్ట్స్ అన్నీ శ్రీచైతన్నవే అనే నమ్మకం మాకుందని అన్నారు. అదేవిధంగా 2023వ సంవత్సరం IIT-JEE, NEET లాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నంబర్ వన్ హ్యాట్రిక్ ర్యాంకులతో శ్రీచైతన్య రికార్డ్ బ్రేక్ చేసి సత్తా చాటుకున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, మా విద్యాసంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, దోహదపడిన అద్యాపక-అద్యాపకేతర బృందాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ శ్రీ అభినందించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.