
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్లో తొలి డబుల్ హెడర్ (ఒకే రోజులో 2 మ్యాచ్‌లు) నేడు జరగనుంది. ఈ రోజు తొలి మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్‌లో తలపడుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్హక్ ఫరూఖీ.