
ఐపీఎల్-18లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు సాధించిన హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ జట్టును ఏ పరిస్థితుల్లోనూ కోలుకోనివ్వలేదు. ధీటుగా పోరాడిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులకే పరిమితమైంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఆర్ఆర్ తరఫున ధ్రువ్ జురెల్ 70 పరుగులు, సంజు సామ్సన్ 67 పరుగులు చేశారు. ఆ తర్వాత షిమ్రాన్ హెట్మెయర్ (42), శుభం దుబే (34) యాభై పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకుని స్కోరును 200 దాటించారు. కానీ, జట్టు విజయానికి సహాయం చేయలేకపోయారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఇషాన్ కిషన్ 106 పరుగులు చేశాడు, 45 బంతుల్లో తన IPL కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు. ట్రావిస్ హెడ్ 67, హెన్రిచ్ క్లాసెన్ 34, నితీష్ రెడ్డి 30, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశారు. రాజస్థాన్ తరఫున తుషార్ దేశ్‌పాండే 3 వికెట్లు, మహేష్ తీక్షణ 2 వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్హక్ ఫరూఖీ.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్స్: సంజు శాంసన్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, క్వేనా మఫాకా.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్స్: సచిన్ బేబీ, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..