
SRH Breaks Power-Play Record: గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఆధిపత్యాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2025లోనూ అదే దూకుడుతో బ్యాటింగ్ చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరుగుతున్న IPL 2025 మ్యాచ్‌లో మరో భారీ మైలురాయిని చేరుకుని, సత్తా చాటింది. హైదరాబాద్ డేంజరస్ ఓపెనర్ల దెబ్బకు ఆర్ఆర్ బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. దీంతో రికార్డుల లెక్కలు మారిపోయాయి.
ఐపీఎల్లో మరో రికార్డును బద్దలు కొట్టిన SRH..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుతంగా రాణించారు. బౌండరీలు బాదేందుకు ఇద్దరూ పోటీ పడ్డారు. ఈ జోడీ 19 బంతుల్లో 45 పరుగులు జోడించారు. అభిషేక్ భారీ షాట్ ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. తొలి వికెట్ పడిన తర్వాత హెడ్‌కి తోడైన ఇషాన్ కిషన్ పరుగుల వేగాన్ని ఏమాత్రం తగ్గించలేదు. ఈ క్రమంలో 6 ఓవర్లలో 94 పరుగులు సాధించింద. సెంచరీకి జస్ట్ 6 పరుగుల దూరంలో నిలిచింది.
ఇది ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యధిక పవర్-ప్లే స్కోరుగా నిలిచింది. గత సీజన్లో నైట్ రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ నెలకొల్పిన 93/1 రికార్డును బద్దలు కొట్టింది. ఆసక్తికరంగా, SRH గత సీజన్లో సాధించిన మొదటి, రెండవ అత్యధిక పవర్‌ప్లే స్కోర్లను కూడా సాధించింది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్లో అత్యధిక పవర్-ప్లే స్కోర్లు..
జట్టు | పవర్-ప్లే స్కోర్ | ప్రత్యర్థి | సంవత్సరం |
ఎస్ఆర్హెచ్ | 125/0 | డిసి | 2024 |
ఎస్ఆర్హెచ్ | 107/0 | ఎల్ఎస్జి | 2024 |
కెకెఆర్ | 105/0 | ఆర్సిబి | 2017 |
సిఎస్కె | 100/2 | పిబికెఎస్ | 2014 |
ఎస్ఆర్హెచ్ | 94/1 | ఆర్ఆర్ | 2025 |
గత సంవత్సరం ఢిల్లీ క్యాపిటల్స్ పై 125/0 స్కోరుతో SRH అత్యధిక పవర్-ప్లే స్కోరును నమోదు చేసింది. రెండవ అత్యుత్తమ స్కోరు కూడా హైదరాబాద్ జట్టుదే. 107 పరుగులతో పంజాబ్ కింగ్స్‌ను అధిగమించి ఐదవ స్థానంలో నిలిచింది.
అభిషేక్ 11 బంతుల్లో 24 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. హెడ్ తన అత్యుత్తమ ప్రదర్శనతో 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు. కానీ తుషార్ దేశ్‌పాండే అతనిని అవుట్ చేశాడు. ప్రస్తుతానికి, ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. 14.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది హైదరాబాద్ జట్టు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..