

ఐపీఎల్ 27వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సన్రైజర్స్ హైదరాబాద్కు 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్ హర్షల్ పటేల్ 4 వికెట్లు పడగొట్టాడు.
చివరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ మహమ్మద్ షమీపై వరుసగా 4 సిక్సర్లు కొట్టి జట్టు స్కోరును 245కు తీసుకెళ్లాడు. స్టోయినిస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ప్రభసిమ్రాన్ సింగ్ 42, ప్రియాంష్ ఆర్య 36 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టాడు.