
Sunrisers Hyderabad vs Gujarat Titans, 19th Match Live Score in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ హోం గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది.
ఈ సీజన్లో హైదరాబాద్‌కు ఇది ఐదవ మ్యాచ్ కాగా, గుజరాత్‌కు నాల్గవ మ్యాచ్ అవుతుంది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR)ను 44 పరుగుల తేడాతో ఓడించింది. అయితే, ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
మరోవైపు, గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించాలని చూస్తోంది. పంజాబ్ కింగ్స్ పై ఓటమితో తన ప్రచారాన్ని ప్రారంభించిన గుజరాత్.. తన రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (MI) ను, మూడో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను ఓడించింది.
ఇరు జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అర్షద్ ఖాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్లు: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, సిమర్జీత్ సింగ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.