

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితిని నిర్మాత బన్నీ వాసు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కిమ్స్ వైద్యులు.
బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేకుండానే ఆక్సిజన్ తీసుకుంటున్నాడని తెలిపారు. అలాగే ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ప్రక్రియ ద్వారా అతడి పొట్టలోకి ఆహారం పంపిస్తున్నామని అన్నారు. శ్రీతేజ్ ఇప్పటికీ కుటుంబసభ్యులను గుర్తించలేకపోతున్నాడని.. అతడి శరీర కదలికల కోసం ఫిజియోథెరపీ చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
గతేడాది డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల సందర్భంగా డిసెంబర్ 4న బెనిఫిట్ షో వేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద అర్దరాత్రి తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు మూడు నెలలుగా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు శ్రీతేజ్. ఇప్పిటికీ ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడు. అలాగే అతడికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తొలగించామని.. ప్రస్తుతం శ్రీతేజ్ ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడని.. అతడి శరీరంలో కదలికల కోసం ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..