
మధుమేహం వచ్చినవారు రెగ్యులర్‌గా కొన్ని వంటింటి మసాలాలను తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ మసాలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మెంతులలో ఉన్న ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. వీటిని ఎలా తీసుకోవాలంటే..? 1 టీ స్పూన్ మెంతులను నీటిలో మరిగించి ఉదయాన్నే గోరు వెచ్చగా తాగాలి.
మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ రసాయనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 1-2 వెల్లుల్లి రెబ్బలను తినాలి. లేదంటే వెల్లుల్లి టీ తయారు చేసుకుని తాగవచ్చు. అందుకోసం 2 వెల్లుల్లి రెబ్బల్ని నీటిలో వేసి బాగా మరిగించి వడకట్టి గోరువెచ్చగా తాగండి.
దాల్చిన చెక్కను కూరల్లో, సూప్‌లలో, స్మూతీలలో ఉపయోగించవచ్చు. దీనిలో ఉన్న రసాయనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క పొడిని టీగా తయారు చేసుకుని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి.
1 గ్లాస్ నీటిని మరిగించి అందులో దాల్చిన చెక్క పొడిని వేసి వడకట్టుకొని తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
డయాబెటిస్ నియంత్రణకు వంటింటి మసాలాలు చాలా సహాయపడతాయి. మెంతులు, వెల్లుల్లి, దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. ఈ సహజమైన మార్గాలు డయాబెటిస్ సమస్యను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.