
భారత క్రికెట్ జట్టుకు ఎంతో మంది కెప్టెన్లుగా పని చేశారు. అందులో బెంగాల్ టైగార్ సౌరవ్ గంగూలీది భిన్నమైన శైలి. నిజం చెప్పాలంటే భారత క్రికెట్ జట్టు రూపు రేఖలు మార్చిన ఘనత అతనికే సొంతం. ‘ బాగా ఆడితే చాలు’ అనే మనస్తత్వం నుండి ‘గెలవాలి’ అనే ఆలోచన తీసుకొచ్చిన వ్యక్తి గంగూలీ. అలాంటి దిగ్గజ క్రికెటర్ జీవితం గురించి సినిమా తీయాలనే చర్చ 2019 నుంచి
ఉంది. 2019లో ఒక నిర్మాణ సంస్థ దాదా బయోపిక్ కు సంబంధించిన హక్కులను కొనుగోలు చేసింది. కానీ ఆ సినిమా సెట్ పైకి వెళ్లలేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత గంగూలీ బయోపిక్ గురించి మళ్లీ ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. సౌరవ్ గంగూలీ పాత్రకు నటుడి ఎంపిక గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. మొదట్లో గంగూలీ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయుష్మాన్ పేరు తెర మీదకు వచ్చింది. కానీ ఇప్పుడు నటుడు రాజ్ కుమార్ రావు గంగూలీ పాత్రను పోషించనున్నాడు. రాజ్‌కుమార్ రావుతో పాటు, కొంతమంది బెంగాలీ నటులు కూడా ఈ బయోపిక్ లో భాగం కానున్నారు.
ఇవి కూడా చదవండి
సౌరవ్ గంగూలీ బయోపిక్ కు విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహించనున్నారు. దాదా సన్నిహితుడు, చిత్ర సహ నిర్మాత సంజయ్ దాస్ ప్రకారం ఈ బయోపిక్ స్క్రిప్ట్ మొదటి డ్రాఫ్ట్‌ను చదివి కొన్ని మార్పులను సూచించారట. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని, నటీనటులను కూడా ఫైనలేజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ బయోపిక్ లో సౌరవ్ గంగూలీ బాల్యం, టీనేజ్, క్రికెట్ రోజులు, అతని నాయకత్వం, అలాగే అతని వ్యక్తిగత సమస్యల గురించి చూపించనున్నారు.ఈ బయోపిక్ లో గంగూలీ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
తుది దశకు స్క్రిప్ట్ పనులు
Sourav Ganguly’s Biopic-
former Indian cricket team captain and one of the most influential figures in Indian cricket, recently confirmed that Bollywood actor Rajkummar Rao will portray him in his upcoming biopic. Speaking to the media in Bardhaman, West Bengal, Ganguly shared… pic.twitter.com/MSCdXF0wRV
— Dr. Shiv Narayan S. (@Shiv_Narayans) February 21, 2025
కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, ముత్తయ్య మురళీధరన్, మిథాలీ రాజ్, ప్రవీణ్ తాంబే, మహ్మద్ అజారుద్దీన్ వంటి క్రికెటర్ల జీవితాలపై ఇప్పటికే సినిమాలు విడుదలయ్యాయి. త్వరలోనే యువరాజ్ సింగ్ జీవితాన్ని కూడా సినిమాగా తీయనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..