నవభారత్ బాలాజీ.. ఒకప్పుడు సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు.. సహయ నటుడిగా కనిపించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవభారత్ బాలాజీ, నటుడు, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ అనుభవాలను వెల్లడించారు. ముఖ్యంగా దివంగత నటి సౌందర్యతో తన అనుబంధం, ఆమె కెరీర్ తొలినాళ్ల విశేషాలను పంచుకున్నారు. సౌందర్య తన సినీ జీవితం ప్రారంభంలో ఒక నెలన్నర పాటు బాలాజీ కార్యాలయం-నివాసంలో ఉన్నారని, అప్పట్లో ఆమె చాలా చిన్న పిల్ల అని గుర్తు చేసుకున్నారు. నిర్మాతగా, కేవలం వినోదం పంచే కమర్షియల్ చిత్రాలు తీయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
కెరీర్ మొదట్లో ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు చాలా మంది డిప్రెషన్లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. సౌందర్యతో తన అనుబంధం గురించి బాలాజీ ప్రత్యేకంగా వివరించారు. ఆమె సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తన ఇంటికి దగ్గర ఉన్న ఆఫీస్ కమ్ రెసిడెన్సీలో నెలన్నర పాటు ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉన్నారని అన్నారు. అప్పట్లో ఆమె చాలా చిన్న అమ్మాయి అని గుర్తు చేసుకున్నారు. అమ్మోరు సినిమా సౌందర్య కెరీర్‌ను మార్చిందని ఆయన తెలిపారు. తాను సౌందర్యతో పాటు శారద, వాణిశ్రీ వంటి నటీమణులతో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉండేదని, వారితో తనకు మంచి అనుబంధం ఉండేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ప్రొడ్యూసర్‌గా తాను కేవలం వినోదం పంచే వాణిజ్య చిత్రాలు తీయడానికే ప్రాధాన్యత ఇస్తానని బాలాజీ స్పష్టం చేశారు. సందేశాత్మక చిత్రాలు తీయాలనే కోరిక తనకు లేదని అన్నారు. నిర్మాతలకు ఒకప్పుడు ఉన్న విలువ ఇప్పుడు తగ్గిపోయిందని, తన తండ్రి నుండి నేర్చుకున్న సమయపాలన, క్రమశిక్షణ తనను ఒక మంచి నిర్మాతగా తీర్చిదిద్దాయని తెలిపారు. అమ్మెరు సినిమాకు సౌందర్య రూ.45వేలు తీసుకుందట.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
