
సోడా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మంది సోడా తాగుతూనే ఉంటారు. ఎక్కువగా తిన్నది అరగనట్టుగా ఉన్నప్పుడు, కడుపు నొప్పిగా ఉన్నప్పుడు, కడుపు ఉబ్బరంగా ఉన్న సమయంలో కూడా సోడా తాగుతూ ఉంటారు. అయితే సోడా తాగడం వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయట.
సోడా తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. సోడా తాగడం వల్ల జీవక్రియ అనేది మెరుగు పడుతుంది. దీని వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం సమస్య కూడద ఉండదు.
ఈ క్రమంలో శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కూడా కరుగుతుంది. అంతే కాకుండా సోడా తక్కువగా తీసుకున్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఎక్కువగా తినబుద్ధి కాదు. దీంతో ఇలా ఈజీగా బరువు తగ్గొచ్చు.
జీవక్రియ వేగంగా పెరిగితే.. శరీరంలో ఉండే శక్తి నిల్వలు కూడా త్వరగా ఖర్చు అవుతాయి. క్యాలరీలు ఖర్చు అయితే త్వరగా బరువు తగ్గుతారు. కాబట్టి సోడా వల్ల ఇది ఉపయోగమే అంటున్నారు పరిశోధకులు.
వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు.. రోజూ ఓ గ్లాస్ సోడా తాగవచ్చని అంటున్నారు. సోడా తాగడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుందని, రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)