
టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకుంది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా..? తొలి చిత్రంతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. స్నేహా ఉల్లాల్. 2007లో విడుదలైన నేను మీకు తెలుసా సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మంచు మనోజ్ నటించిన ఈసినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి పాపులారిటీ రాలేదు. ఆ తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో స్నేహాకు మంచి గుర్తింపు వచ్చింది.
ఈ సినిమా తర్వాత తెలుగులో యంగ్ హీరో సుశాంత్ నటించిన కరెంట్ సినిమాలో కనిపించింది. ఈ సినిమాకు పాజిటివ్ రావడంతోపాటు స్నేహాకు సైతం మంచి పాపులారిటి వచ్చింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కడతాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తెలుగులో స్నేహాకు తక్కువ అవకాశాలు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సింహ సినిమాలో కనిపించింది. చివరగా 2011లో మడత కాజా అనే సినిమాలో నటించింది.
ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న స్నేహా ఉల్లాల్.. రెగ్యులర్ గా ఫోటోస్, వీడియోస్ అప్లోడ్ చేస్తుంది. ఇటీవల ఈ బ్యూటీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొట్టింది. బాలీవుడ్ నిర్మాత కుమారుడితో పెళ్లికి సిద్ధమయ్యిందని.. అతడికి ఇంతకు ముందే పెళ్లైపోయిందని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..