
టాలీవుడ్ బాపు బొమ్మగా.. జూనియర్ సౌందర్యగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ స్నేహ. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
గోపిచంద్ సరసన తొలివలపు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహ. ఆ తర్వాత తరుణ్ సరసన ప్రియమైన నీకు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఈ మూవీతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.
స్కిన్ షో చేయకుండానే సంప్రదాయ లుక్ లో ఎంతో పద్దతిగా కనిపిస్తూ అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది స్నేహ. తెలుగులో హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, రాధ గోపాలం, ఎవండోయ్ శ్రీవారు వంటి చిత్రాల్లో నటించింది.
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తమిళ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ఇటు చీరల వ్యాపారం స్టార్ట్ చేసింది స్నేహ. పట్టుచీరల షాపింగ్ మాల్ సైతం ఓపెన్ చేసింది. తాజాగా తన ఇన్ స్టాలో స్నేహ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. గోల్డెన్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తుంది స్నేహ.