
తక్కువ ధరకు లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఫోన్లలో ఇన్ఫినిక్స్ నోట్స్ 50 ఎక్స్ ముందుంటుంది. దీనిలో 6.67 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, మీడియా టెక్ డైమన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ తో ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. కెమెరాల విషయానికి వస్తే 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెకండరీ ఆక్సిలరీ లెన్స్ తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. 45 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీని ధర రూ.11,499 మాత్రమే.
ఐక్యూ బ్రాండ్ నుంచి విడుదలైన ఫోన్లలో అత్యంత తక్కువ ధరకు లభించే బెస్ట్ ఫోన్ ఇదేనని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు. పూర్తి హెచ్ డీ రిజల్యూషన్ కలిగిన 6.72 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్క్రీన్, ఐపీ 64 రేటింగ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ తో పనితీరు బాగుంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్ టచ్ ఓఎస్ 14పై నడుస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్ 15కి అప్ డేట్ చేయనున్నారు. 50 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ డెప్త్ సెన్సార్లతో పాటు 8 ఎంపీ ముందు కెమెరా ఏర్పాటు చేశారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్ రూ.11,999 ధరకు అందుబాటులో ఉంది.
అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్న 5జీ ఫోన్లలో మోటో జీ45 ఒకటి. దీనిలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో డిస్ ప్లేకి పూర్తి రక్షణ లభిస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ కెమెరాలతో పాటు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అమర్చారు. 18 డబ్ల్యూ పాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా చక్కగా వినియోగించుకోవచ్చు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కలిగిన ఈ ఫోన్ ధర రూ.10,999 మాత్రమే.
పోకో ఎం7 స్మార్ట్ ఫోన్ లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 6.88 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్క్రీన్ తో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్ప్లాష్ రెసిస్టెన్స్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ బాగున్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ ఓఎస్ పై నడుస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ లో భాగంగా 50 ఎంపీ ప్రైమరీ, సెకండరీ ఆక్సిలరీ లెన్స్, 8 ఎంపీ ముందు కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ను కేవలం రూ.9,999కు కొనుగోలు చేయవచ్చు.
రియల్ మీ నార్జో 70 ఎక్స్ స్మార్ట్ ఫోన్ లో 6.72 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే బాగుంది. పూర్తి హెచ్ డీ రిజల్యూషన్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. దుమ్మ, నీటి నుంచి రక్షణకు ఐపీ 54 రేటింగ్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, మీడియ టెక్ డైమన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రియల్ మీ యూఐ 5.0పై నడుస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ తో పాటు ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. దీనిలోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 45 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. రూ.11,999కి ఈ ఫోన్ అందుబాటులో ఉంది.