
బౌల్ట్ డ్రిప్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ లోని 1.85 అంగుళాల హెచ్ డీ స్క్రీన్ ద్వారా విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ద్వారా ప్రయాణ సమయంలో సులభంగా కాల్స్ ను చేసుకోవచ్చు. అంతర్నిర్మిత ఏఐ వాయిస్ అసిస్టెంట్ కమాండ్ ద్వారా వివిధ ఫంక్షన్లను నియంత్రించుకోవచ్చు. హార్ట్ బీటు పర్యవేక్షణ తదితర అనేక ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఫిట్ నెస్ కు సంబంధించి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు ఏడు రోజులు పనిచేస్తుంది. కేవలం 38 గ్రాముల బరువుండే ఈ వాచ్ అమెజాన్ లో రూ.1399కి లభిస్తుంది.
ఫాస్ట్రాక్ నుంచి విడుదలైన లిమిట్ లెస్ స్మార్ట్ వాచ్ మణికట్టుకు మరింత అందాన్ని ఇస్తుంది. ప్రకాశవంతమైన రిజల్యూషన్, అల్ట్రా వీయూ హెచ్ డీ డిస్ ప్లే, ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. క్రీడాప్రియులకు చక్కగా సరిపోతోంది. లైవ్ అప్ డేట్లు, నోటిఫికేషన్లతో పాటు 85కి పైగా స్పోర్ట్ మోడ్ లు అమర్చారు. ఏఐ వాయిస్ సాయంతో రిమైండర్లను సులభంగా సెట్ చేసుకోవచ్చు. ప్రయాణంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా కాల్స్ స్వీకరించవచ్చు. సుమారు 48 గ్రాముల బరువుంటే ఈ వాచ్ ను ఒక్కసారి రీచార్జి చేస్తే సుమారు ఏడు రోజులు పనిచేస్తుంది. అమెజాన్ లో రూ.1399కి ఈ వాచ్ అందుబాటులో ఉంది.
ఫైర్ బోల్ట్ నుంచి విడుదలైన నింజా కాల్ ప్రోప్లస్ స్మార్ట్ వాచ్ స్లైలిష్ డిజైన్ తో ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలోని 1.83 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లేలో అంకెలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలా రోజులు పనిచేసే బ్యాటరీని ఏర్పాటు చేశారు. రిమైండర్లను సెట్ చేసుకోవడానికి, వాతావరణాన్ని తెలుసుకోవడానికి ఏఐ వాయిస్ సాయం తీసుకోవచ్చు. బ్లూటూత్ కాలింగ్ ద్వారా హ్యాండ్స్ ఫ్రీ సౌకర్యం లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఈ వాచ్ అమెజాన్ లో రూ.1,399కి అందుబాటులో ఉంది.
నాయిస్ నుంచి విడుదలైన పల్స్ 4 మ్యాక్స్ స్మార్ట్ వాచ్ అద్భుత డిజైన్ తో ఆకట్టుకుంటోంది. మీకు నచ్చిన విధంగా అనేక ఏఐ వాచ్ ఫేస్ లను సెట్ చేసుకోవచ్చు. హార్ట్ బీటు, నిద్ర ట్రాకింగ్, ఎస్పీఓ2 కొలత తదితర ఆధునిక ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లు ఏర్పాటు చేశారు. దీనిలో ఐపీ 68 నీటి నిరోధక ఫీచర్ తో వాచ్ కు రక్షణ లభిస్తుంది. మీరు దీన్ని ధరించి ఈత కొట్టినా, వానలో తడిసినా ఎలాంటి ఇబ్బంది కలగదు. సుమారు 45 గ్రాముల బరువుంటే ఈ వాచ్ ను అమెజాన్ లో 2,499కి కొనుగోలు చేయవచ్చు.
పంక్ఫంక్ బ్రాండ్ విడుదల చేసిన 80 గ్రాముల ఈవో విస్టా స్మార్ట్ వాచ్ లో 1.3 అంగుళాల హెచ్ డీ కలర్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ వాచ్ ద్వారా హార్ట్ బీటు, నిద్ర సమయం తదితర వాటిని పరిశీలించుకోవచ్చు. రోజు వారీ జీవితంలో ఉపయోగపడే 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్ లకు మద్దతు ఉంది. వ్యాయామం చేసే సమయంలో దూరం, అడుగులు, కేలరీలను తెలుసుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు ఏడు రోజుల పాటు వాచ్ పనిచేస్తుంది. సంగీత నియంత్రణ, రిమోట్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ లో రూ.1,499కి ఈ వాచ్ ను కొనుగోలు చేసుకోవచ్చు.