
సామ్సంగ్ నుంచి విడుదలైన 65 అంగుళాల ఎల్ఈడీ 4కే స్మార్ట్ టీవీలోని అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ తో విజువల్స్ చాలా బాగుంటాయి. క్రిస్టల్ ప్రాసెసర్ 4కే ఆధారితమైన ఈ టీవీలోని యూహెచ్ డీ డిమ్మింగ్, 4కే అప్ స్కేలింగ్..చిత్ర నాణ్యతను మరింత మెరుగుపరుస్తాయి. స్క్రీన్ పై ప్రతి అక్షరం చక్కని రంగులతో కనిపిస్తుంది. బిక్సీ, యాపిల్ ఎయిర్ ప్లే వంటి స్మార్ట్ ఫీచర్లు, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి వాటికి యాక్సెస్, క్యూ సింపోనీతో కూడిన 20 డబ్ల్యూ స్పీకర్లు, మంచి డిజైన్, వాయిస్ అసిస్టెంట్ అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో రూ.65,990కి ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.