
రియల్మీ పి3 ఎక్స్ 5జీ సొగసైన వీగన్ లెదర్ డిజైన్‌తో ప్రత్యేకంగా వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 13,999గా ఉంది. డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పాటు భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆకర్షిస్తుంది. అలాగే 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 50 ఎంపీ వెనుక కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్16 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 14,499కే అందుబాటులో ఉంది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్లో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తుంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ఫొటోగ్రఫీ ప్రియులను అమితంగా ఆకర్షిస్తుంది.
మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలంటే వివో టీ4 ఎక్స్ 5 జీ స్మార్ట్ ఫోన్ సరిగ్గా సరిపోతుంది. రూ. 13,999కే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన బలమైన 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈఫోన్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ లెన్స్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
రూ. 10,299కే అందుబాటులో ఉండే పోకో ఎం6 ప్లస్ 5జీ ఇటీవల ఎక్కువగా ఆకర్షిస్తుంది. 108 ఎంపీ బ్యాక్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్-2 ఏఈ ప్రాసెసర్ లాగ్ ఫ్రీ వినియోగాన్ని నిర్ధారిస్తుంది. ఈ ఫోన్ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తుంది.
రూ. 11,999 ధరకే అందుబాటో ఉన్న మోటోరోలా జీ45 5జీ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 ఎస్ జెన్-3 ప్రాసెసర్‌తో వస్తుంది. 8 జీబీ+128 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ 50 ఎంపీ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకట్టుకుంటుంది.