
పెట్టుబడులు దీర్ఘకాలికంగా ఉంటే రాబడి అదే స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులను ఖర్చు చేయకుండా స్వీయ నియంత్రణ ఉన్నప్పుడు చిన్న పెట్టుబడి నుంచి పెద్ద కార్పస్ సృష్టించడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. మీ ఆర్థిక లక్ష్యాలు, మీరు పెట్టుబడి పెట్టే మొత్తం ఆధారంగా పెట్టుబడి వ్యవధి మారవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడికి దాని సొంత ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న నెలవారీ లేదా ఒకేసారి పెట్టుబడితో కూడా పెద్ద కార్పస్‌ను సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టే వారు వారిక 18వ ఏట రూ.1.80 లక్షలు డిపాజిట్ చేస్తే వారు రిటైర్ అయ్యే సమయానికి ఏకంగా రూ.2.10 కోట్లకు పైగా పదవీ విరమణ నిధిని పొందవచ్చని పేర్కొంటున్నారు.
రూ. 5,000 నెలవారీ ఎస్ఐపీ
ఒక వ్యక్తి నెలకు రూ.5,000 ఎస్ఐపీతో పెట్టుబడితో ప్రారంభించి వారి పెట్టుబడులపై 13 శాతం వార్షిక రాబడిని పొందితే 15 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి రూ. 9,00,000 అవుతుంది. అలాగే మూలధన లాభాలు రూ. 16,92,624గా ఉంటే మొత్తం రూ. 25,92,624 చేతికి అందుతుంది. 25 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి రూ. 15,00,000గా ఉంటే రూ. 84,82,392 మూలధన లాభంగా వస్తుంది. అంటే రాబడి రూ. 99,82,392 అవుతుంది. నెలకు రూ.5 వేలు చొప్పున 35 సంవత్సరాలలో పెట్టుబడి పెడితే రూ. 21,00,000. ఈ పెట్టుబడిపై అంచనా వేసిన మూలధన లాభాలు రూ. 3,29,67,459గా ఉంటుంది. అంటే దాదాపు రిటైర్ అయ్యే సమయానికి రూ. 3,50,67,459 పొందవచ్చు.
రూ. 7,50,000 వన్-టైమ్ డిపాజిట్‌తో రూ. 2.25 కోట్ల రాబడి
రూ. 7,50,000 వన్-టైమ్ డిపాజిట్ చేస్తే 10 సంవత్సరాలలో, అంచనా వేసిన మూలధన లాభాలు రూ. 15,79,386 వస్తుంది. కార్పస్ కూడా రూ. 23,29,386 అవుతుంది. 20 సంవత్సరాలలో అయితే మూలధన లాభాలు రూ. 64,84,720గా ఉంటే రూ. 72,34,720 చేతికి వస్తుంది. 30 సంవత్సరాల్లో మూలధన లాభాలు రూ. 2,17,19,942గా ఉంటే రూ. 2,24,69,942 రాబడి వస్తుంది.
ఇవి కూడా చదవండి
రూ.1.80 లక్షల పెట్టుబడితో
సాధరణంగా పదవీ విరమణ వయస్సుగా 60 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మీకు 18 ఏళ్ల సమయంలో రూ.1.80 లక్షల పెట్టుబడి పెడితే రూ.2,08,30,164.72 మూలధన లాభాలు వస్తాయి. అయితే అంచనా వేసిన కార్పస్ రూ.2,10,10,164.72గా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి