
భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ని సింగపూర్‌లో అనుమతించేందుక అక్కడ ప్రాచుర్యంగా పొందిన హిట్ పేతో ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ చర్యల వల్ల సింగపూర్ వెళ్లే భారతీయ పర్యాటకులు రెస్టారెంట్లు, దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు చేయడం సులభం అవుతుంది. ముఖ్యంగా కరెన్సీ మార్పిడి లేదా అంతర్జాతీయ రుసుముల ఇబ్బందిని తొలగిస్తుంది. సింగపూర్‌లోని ఏకంగా 12,000 కంటే ఎక్కువ వ్యాపారులు యూపీఐ ఆమోదిస్తున్నారు. ఆన్లైన్, స్టోర్‌లో లావాదేవీలను యూపీఐ వాడి సులభంగా చేవచ్చు.
సింగపూర్‌లో హిట్ పేతో జతకట్టడం ద్వారా భారత పర్యాటకులకు సింగపూర్ చెల్లింపులను సులభం అవుతాయని ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా తెలిపారు. ఈ ఒప్పందం భారతీయులకు ప్రయాణించేటప్పుడు నమ్మకమైన, సరసమైన చెల్లింపు పద్ధతిని అందిస్తుంది. భారతదేశంలో యూపీఐ చెల్లింపు వ్యవస్థ అసమానమైన వేగం, సరళత, స్కేలబిలిటీతో విప్లవాత్మకంగా మార్చింది. అలాగే సింగపూర్‌లో కూడా హిట్ పే అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో హిట్పేతో జతకట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొన్ని మార్కెట్లకు కూడా త్వరలో యూపీఐ జతకట్టే అవకాశం ఉందని వివరిస్తన్నారు.
సింగపూర్‌లో యూపీఐ వినియోగం ఇలా
మీరు సింగపూర్‌కు ప్రయాణిస్తుంటే, చెల్లింపుల కోసం యూపీఐను ఉపయోగించాలనుకుంటే మీ యూపీఐ యాప్ అంతర్జాతీయ లావాదేవీలకు మద్దతు ఇస్తుందో? లేదో? నిర్ధారించుకోవాలి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, బీమ్ యూపీఐ వంటి యాప్‌లు అంతర్జాతీయ లావాదేవీలకు మద్దతు ఇస్తున్నాయి. అయితే సింగపూర్ ప్రయాణించే ముందు మీ బ్యాంక్ లేదా ప్రొవైడర్‌తో తనిఖీ చేయడం ఉత్తమం. మీ ఫోన్లో ఉన్న యూపీఐ యాప్‌లో స్కానర్‌ను ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నగదు మొత్తాన్ని నమోదు చేసి మీ యూపీఐ పిన్‌తో ఆధారంగా లావాదేవీ చేయవచ్చు. కరెన్సీ మార్పిడి లేదా అదనపు రుసుముల బాదుడు నుంచి యూపీఐ చెల్లింపులు రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ సంవత్సరం ప్రారంభంలో ఎన్ఐపీఎల్, యూఏఈ అంతటా ఉన్న టెర్మినల్స్‌లో క్యూఆర్-ఆధారిత యూపీఐ చెల్లింపులను ప్రారంభించడానికి యూఏఈ ఆధారిత మాగంటితో ఎన్పీసీఐ ఒప్పందం చేసుకుంది. సెప్టెంబర్ 2024లో భారతదేశ యూపీఐ ఆధారంగా రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ట్రినిడాడ్, టొబాగోకు సంబంధించిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది అందువల్ల ట్రినిడాడ్, టొబాగో యూపీఐను ఆమోదించే మొదటి కరేబియన్ దేశంగా నిలిచింది. సింగపూర్, ట్రినిడాడ్, టొబాగో, యూఏఈ కాకుండా అనేక ఇతర దేశాలు కూడా యూపీఐ చెల్లింపులను ఆమోదిస్తున్నాయి. వీటిలో భూటాన్, మారిషస్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి