
మహా రాస్త్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ. ఇక్కడ కొలువైన సాయిబాబాను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు వెళ్తారు. దీంతో భక్తుల కోసం షిర్డీ సాయిబాబా సంస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయిబాబా దర్శనం కోసం వచ్చే భక్తుడికి ప్రమాదా భీమాను కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ ఉచిత భీమా సౌకర్యం సాయి నాథున్ని దర్శించుకునేందుకు వెళ్తున్న సమయంలో లేదా దర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామం వస్తున్నప్పుడో ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఆ భక్తులకు ఈ బీమాను అందిస్తామని చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
షిర్డీ సాయి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించనున్నట్లు సాయిబాబా సంస్థాన్ సీఈవో చెప్పారు. అయితే భక్తులు సాయిబాబా దర్శనం, భక్త నివాస్, అభిషేకం, మిగతా పూజ కార్యక్రమాల కోసం అధికారిక వెబ్సైట్లలో బుక్ చేసుకుంటేనే ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంటే షిర్డీ సాయి బాబా దర్శనం కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఈ ఉచిత భీమా సౌకర్యం వర్తిస్తుంది. ఈ భీమా పొందడానికి ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. సుమారు 10 లక్షల మంది భక్తులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ మేరకు బీమా కంపెనీకి రూ.48 లక్షలు చెల్లించినట్లు సాయిబాబా సంస్థాన్ సీఈవో చెప్పారు. ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చింది. కనుక షిర్డీ సాయి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఈ భీమా సౌకర్యాన్ని పొందలనుకుంటే ఆన్ లైన్ లో దర్శనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..