

కొన్ని రోజులుగా వార్తలలో నిలుస్తున్న దసరా విలన్ షైన్ టామ్ చాకో అరెస్టైనట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 10.15 గంటల ప్రాంతంలో అతడిని నార్త్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల రెండు రోజుల క్రితం హోటల్ నుంచి తప్పించుకు పారిపోయిన షైన్ టామ్ చాకో దాదాపు 48 గంటల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. అతడిని అరెస్ట్ చేసి ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. షైన్ టామ్ చాకో కాల్స్, గూగుల్ పే లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అతడిపై కేసు నమోదు చేయడానికి పోలీసులకు అన్ని ఆధారాలు లభించాయని సమాచారం.
ఈ కేసుపై ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్లో విచారణ జరిగింది. అతడిపై NDPS చట్టంలోని సెక్షన్లు 27, 29 (1) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సెక్షన్లలో అతడికి బెయిల్ రావడం అసాధ్యం. NDPS చట్టం ప్రకారం ఈ నేరానికి 10 నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే డాన్సాఫ్ హోటల్లో వెతుకుతూ వచ్చిన డ్రగ్ డీలర్ సజీర్ తనకు తెలుసునని షైన్ చేసిన ప్రకటన కూడా కీలకమైన సాక్ష్యం. నిందితులకు షైన్ ఆర్థిక సహాయం అందించాడని కూడా పోలీసులు అంటున్నారు.
అయితే తాను హోటల్ నుంచి పారిపోవడానికి గల కారణం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని.. అందుకే భయపడి పారిపోయానని షైన్ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ వ్యక్తులు షైన్ కోసం ఎందుకు వెతుకుతున్నారు.. ? ఏ పరిస్థితులలో వచ్చారు ? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే తనకు శత్రువులు పెరిగారని.. అందుకే తనను వెతుకుతున్నారని షైన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. హోటల్ కు పోలీసులు వచ్చారనే విషయం తనకు తెలియదని.. తాను తమిళనాడుకు వెళ్లానని షైన్ పోలీసులకు చెప్పాడు. ఈ అంశంపై మంత్రి సాజి చెరియన్ స్పందిస్తూ తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని అన్నారు. షెన్ విచారణకు ముగ్గురు ACPలు నాయకత్వం వహించారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..