
అమావాస్య తిధిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఏడాదికి 12 అమావాస్య తిథిలు ఉంటాయి. ప్రతి అమావాస్య తిధికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ అమావాస్య తిధుల్లో శని అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. శనివారం వచ్చే అమావాస్యను శని అమావాస్య అంటారు. దీనినిశనిశ్చరి అమావాస్య అని కూడా అంటారు. శని అమావాస్య ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వస్తుంది. శనీశ్వరుడు అమావాస్య రోజున జన్మించాడని నమ్ముతారు. కనుక శనీశ్వరుడు కోపం నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజున శనిదేవుడిని పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం శని అమావాస్య ఎప్పుడు వస్తుంది? దాని ప్రాముఖ్యత ఏమిటి? తెలుసుకుందాం.
శని అమావాస్య ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో చివరి అమావాస్య పాల్గుణ మాసంలో వస్తుంది. ఈ సారి ఏడాది చివరి అమావాస్య శనివారం రోజున రావడంతో శని అమావాస్యగా ప్రాముఖ్యత ను సొంతం చేసుకుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య తిధి మార్చి 28న సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు మార్చి 29న సాయంత్రం 4:30 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని ముఖ్యమైందిగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో శని అమావాస్య మార్చి 29న జరుపుకుంటారు.
శని అమావాస్య ప్రాముఖ్యత
శనీశ్వరుడు కోపాన్ని శాంతింపజేయడానికి , దానానికి శని అమావాస్య రోజు ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శని దేవునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శని అమావాస్య రోజున శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆవ నూనెలో కలిపిన నువ్వులను సమర్పించాలి. నల్లని వస్తువులను దానం చేయాలి. ఈ రోజున శనీశ్వరుడికి అభిషేకం చేయాలి. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు మంత్రాలను కూడా జపించాలి.
ఇవి కూడా చదవండి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం…
జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడు కర్మకు తగిన ఫలితాలను ఇచ్చేవాడు అని పేర్కొంది. అంతేకాదు న్యాయ దేవుడు అని చెప్పబడింది. శని దేవుడిని అత్యంత క్రూరమైన గ్రహం అని కూడా పిలుస్తారు. శనీశ్వరుడిని విధి సృష్టికర్త అని కూడా అంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శనీశ్వరుడు వ్యక్తి చేసిన కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు. కర్మలను బట్టి శిక్షిస్తాడు. శనీశ్వరుడి అనుగ్రహం అపారం.. భక్తితో పూజించిన భక్తులు కోరికలను తీరుస్తాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు