ఒక గొప్ప చారిత్రాత్మక ఘనత సాధించారు భూపతిరాజు అన్మిష్ వర్మ.. ప్రఖ్యాత సెవెన్ వోల్కానిక్ సమ్మిట్స్, సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్‌లను విజయవంతంగా పూర్తి చేసి, మూడు కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించారు. సెవెన్ వోల్కానిక్ సమ్మిట్స్ను అత్యంత వేగంగా పూర్తి చేసిన వ్యక్తిగా, కేవలం 91 రోజుల్లోనే ఈ సమ్మిట్స్ను పూర్తి చేసి, ఇంతకుముందు ఉన్న 183 రోజుల రికార్డును అన్మిష్ వర్మ దాటారు. సెవెన్ వోల్కానిక్ సమ్మిట్స్ అండ్ సెవెన్ సమ్మిట్స్ రెండింటినీ అత్యంత వేగంగా పూర్తి చేసిన వ్యక్తిగా, అలాగే రెండు అత్యంత కష్టమైన మౌంటెనీరింగ్ ఛాలెంజ్‌లను అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేసిన రికార్డ్ భూపతిరాజు అన్మిష్ వర్మ పేరుపై నమోదైంది.
ఈ రెండు సమ్మిట్స్ను అధిగమించిన అతిపిన్న వయస్సు గల వ్యక్తిగా రికార్డుకెక్కారు. అంతేకాకుండా ఈ ప్రతిష్టాత్మక ఘనతను అత్యంత పిన్న వయస్సులో సాధించిన వ్యక్తిగా అన్మిష్ వర్మ నిలువడం గమనార్హం.
అచంచల సంకల్పంతో విజయాల శిఖరాలను అధిరోహించిన అన్మిష్ వర్మ.. ఈ అసాధారణ ప్రయాణం మనిషి సామర్థ్యాల గరిష్ట పరిమితిని పరీక్షించి, మౌంటెనీరింగ్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ, అన్మిష్ వర్మ తన అంకితభావం, సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నారు.
అసాధారణమైన ఈ ప్రయాణం సహనం, శక్తి , ప్యాషన్‌తో కలగలిపింది. ఈ రికార్డులను తిరగరాయడం అంటే మన సామర్థ్యాలను పరీక్షించుకోవడం, కొత్త సవాళ్లను స్వీకరించడం, లక్ష్యంపై దృష్టి సారించడమే కాకుండా నిజమైన సంకల్ప బలానికి నిదర్శనమని భూపతిరాజు అన్మిష్ వర్మ అన్నారు.
ఈ ఘనత కేవలం వ్యక్తిగత విజయంగా మాత్రమే కాకుండా, కలలు కన్న వాటిని సాధించగల శక్తి మనలో ఉందని ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. తన ప్రయాణం మిగతావారికి స్ఫూర్తినిచ్చేలా, తమ పరిమితులను అధిగమించి కొత్త హారిజాన్లను అన్వేషించేందుకు ప్రోత్సహించేలా నిలుస్తుంది.
7 సమ్మిట్స్
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను “7 సమ్మిట్స్ ” అని అంటారు.
1. ఏషియా – మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీటర్లు)
2. దక్షిణ అమెరికా – ఆకోంకాగువా (6,961 మీటర్లు)
3. ఉత్తర అమెరికా – డెనాలి (మౌంట్ మెక్‌కిన్లీ) (6,190 మీటర్లు)
4. ఆఫ్రికా – కిలిమంజారో (5,895 మీటర్లు)
5. యూరప్ – ఎల్బ్రస్ (5,642 మీటర్లు)
6. ఆస్ట్రేలియా/ఓషియానియా – కosciuszko (2,228 మీటర్లు) లేదా కర్జెన్స్ పిరమిడ్ (4,884 మీటర్లు)
7. అంటార్కిటికా – విన్సన్ మాస్ (4,892 మీటర్లు)

7 వోల్కానిక్ సమ్మిట్స్
- మౌంట్ ఎల్బ్రస్ – రష్యా – 5,642 మీటర్లు
- గిలువే – పాపువా న్యూ గినియా – 4,368 మీటర్లు
- పర్వతం దమవాండ్ – ఇరాన్ – 5,671 మీటర్లు
- PICO DE ORIZABA (l మెక్సికో – 5,636 మీటర్లు
- కిలిమంజారో – టాంజానియా – 5,895 మీటర్లు
- నెవాడో ఓజోస్ డెల్ సలాడో – అర్జెంటీనా/చిలీ – 6,893 మీటర్లు
- మౌంట్ సిడ్లీ – అంటార్కిటికా – 4,285 మీటర్లు
వీటితో పాటు మిస్టర్ అన్మిష్ వర్మ దక్షిణ ధ్రువానికి స్కైడ్ చేశారు. అలాగే ఈ రాబోయే ఏప్రిల్‌లో ఉత్తర ధ్రువ యాత్రకు సిద్ధమవుతున్నారు. వర్మ 3 సార్లు హాట్రిక్ వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్, వర్మ విభిన్న నైపుణ్యం, బహుళ విభాగాలలో ప్రతిభను, నిబద్ధతను ప్రదర్శించారు మిస్టర్ అన్మిష్ వర్మ. భారతదేశాన్ని గర్వించేలా చేయడమే కాకుండా సాధ్యం కానిదంటూ ఏది లేదని, ఇతరులను ప్రోత్సహింస్తున్నాడు వర్మ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
